‘మంచు’ మంటలు.. ఊహించని మలుపులు!

అస్సలేం లేదని బుకాయించారు. కట్ చేస్తే వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. మంచు మంటలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. చెప్పాలంటే నిన్నటితో పోలిస్తే, ఈరోజు మహా మలుపులు తిరిగింది. Advertisement మంచు…

అస్సలేం లేదని బుకాయించారు. కట్ చేస్తే వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. మంచు మంటలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. చెప్పాలంటే నిన్నటితో పోలిస్తే, ఈరోజు మహా మలుపులు తిరిగింది.

మంచు మనోజ్ పోలీస్ కంప్లయింట్..

ఈరోజు మలుపుల్లో అతిపెద్ద కుదుపు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం. ఆయన స్వయంగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తనపై ఓ 10 మంది దాడి చేశారని ఆయన ఆరోపించాడు. ఘటన జరిగిన సీసీ టీవీ ఫూటేజ్ ను కూడా మాయం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిన్న హాస్పిటల్ చేరి పరీక్షలు చేయించుకున్న మనోజ్.. ఆ మెడికల్ రిపోర్ట్ ను కూడా తన ఫిర్యాదుకు జతచేశాడు. దీంతో మంచు మంటల ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగినట్టయింది.

బౌన్సర్లతో హంగామా..?

అంతకంటే ముందు ఈ వ్యవహారం ఈరోజు ఉదయం నుంచి మలుపులు తిరుగుతూనే ఉంది. ముందుగా మోహన్ బాబు ఇంటి వద్ద మంచు విష్ణు బౌన్సర్లను ఏర్పాటుచేశాడు. అది తెలుసుకున్న మంచు మనోజ్ కూడా తన మనుషుల్ని అక్కడ పెట్టాడు. మరోవైపు మోహన్ బాబు ఇంటి నుంచి సీసీటీవీ ఫూటేజ్ మొత్తాన్ని తన బిజినెస్ పార్టనర్ కు చెప్పి మంచు విష్ణు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

మరోవైపు దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని, అన్ని పనులు మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వచ్చాడు.

మాదాపూర్ లో పంచాయితీ..

ఈ వివాదాన్ని సెటిల్ చేసేందుకు సినీ ఇండస్ట్రీ నుంచి ఓ ప్రముఖుడు, పాలిటిక్స్ నుంచి మరో వ్యక్తి రంగంలోకి దిగారు. మాదాపూర్ లో చర్చలకు వేదిక ఫిక్స్ చేశారు. తన నివాసం నుంచి మోహన్ బాబు ఈ చర్చలకు వెళ్లారు. అటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ కూడా అట్నుంచి అటు మాదాపూర్ వెళ్లాడు. దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు కూడా ఈ పంచాయితీలో జాయిన్ అయినట్టు తెలుస్తోంది.

మంచు మోహన్ బాబుకు చెందిన స్కూళ్లు, కొన్ని ఆస్తులకు సంబంధించి వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. మాటమాట పెరగడంతో, తన అనుచరుడితో మంచు మనోజ్ పై మోహన్ బాబు దాడి చేయించినట్టు చెబుతున్నారు. ఆ దెబ్బలతో నిన్న హాస్పిటల్ లో జాయిన్ అయిన మనోజ్, ఈరోజు డాక్టర్లు ఇచ్చిన నివేదికతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నేరుగా మెహన్ బాబు పై కాకుండా.. కొంతమందిపై ఆయన ఫిర్యాదు చేయడంతో పాటు.. తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆయన అందులో పేర్కొన్నాడు.

ఈ గ్యాప్ లో ఈ ఫ్యామిలీ మేటర్ ను తెరవెనక సెటిల్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రేపటికి మంచు మంటలు చల్లారేలా కనిపిస్తున్నాయి.

20 Replies to “‘మంచు’ మంటలు.. ఊహించని మలుపులు!”

  1. న్యాయంగా తండ్రి గా వాడి వాటా వాడికి ఇచ్చేస్తే వాడి దారి వాడు చూసుకుంటాడు గా? ఈ గొడవలంతా ఎందుకు? ఆల్రెడీ ఉన్న అప్రతిష్ట చాలదా మోహన్ బాబు కు? ఎవ్వడితోనూ పొసగదు.. చివరకి కన్నా కొడుకుతో కూడా గొడవేనా?

  2. న్యాయంగా తండ్రి గా వాడి వాటా వాడికి ఇచ్చేస్తే వాడి దారి వాడు చూసుకుంటాడు గా? ఈ గొడవలంతా ఎందుకు? ఆల్రెడీ ఉన్న అప్రతిష్ట చాలదా?

  3. ఆల్రెడీ ఉన్న అప్రతిష్ట చాలదా మోహన్ బాబు కు? ఎవ్వడితోనూ పొసగదు.. చివరకి కన్నా కొడుకుతో కూడా గొడవేనా?

  4. న్యాయంగా తండ్రి గా వాడి వాటా వాడికి ఇచ్చేస్తే వాడి దారి వాడు చూసుకుంటాడు గా?

  5. మంచు పర్వతం బద్దల్లయ్యింది అన్నమాట, అంతం కాదిది ఆరంభం.

  6. కర్మ ఎవ్వరినీ విడిచి పెట్టదు

    2019 లో జెగ్గులు గాడి మాట విని, కాలేజీ ఫీజులు అంటూ డ్రామాలు దె0గి రోడ్లమీద దొర్లాడు.. ఇప్పుడు అదే కాలేజీలు కాపాడుకోవడం కోసం తండ్రి ‘కొడుకులే బజారున పడి కొట్టుకుంటున్నారు..

    నీ జుట్టు చంద్రబాబు చేతికి చిక్కింది రా ముంచు ము0డా కొడకా’ ఈరోజు..

  7. Veediki debbalu tagalaledu, ayina case pettadu. Manoj ki tagilayi, case pettadu. Evaru abaddalu cheptunnarane vishayam pakkana pedithe, asalu bayata public lo evaru ela behave chestaro chusthe veellasalu entivallo oka idea vastundi. Naakaithe balisi kottukunta sontha dabba tega vayinchukune Bhakthavathsalamgade asalu yedava!

Comments are closed.