డబ్బులిస్తున్నారు… తిడుతున్నారు.. చిత్రం కద!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ చిత్రమైన వ్యవహారం నడుస్తోంది. మరీ చిన్న సినిమాలు వైవిధ్యంగా ఉంటే ఆదరిస్తున్నారు. లేదంటే వాటిని పట్టించుకోవడం లేదు.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ చిత్రమైన వ్యవహారం నడుస్తోంది. మరీ చిన్న సినిమాలు వైవిధ్యంగా ఉంటే ఆదరిస్తున్నారు. లేదంటే వాటిని పట్టించుకోవడం లేదు. మిడ్-రేంజ్ సినిమాలు కాస్త డిఫరెంట్‌గా ఉంటే ఓకే అంటున్నారు. రొటీన్ రొట్ట. కమర్షియల్ రెగ్యులర్ ఫార్మాట్ అంటే థియేటర్ దగ్గరకు కూడా వెళ్లడం లేదు. కానీ బిగ్ మూవీస్ లేదా ఈవెంట్ మూవీస్ కొద్దిగా బాగున్నా కూడా విరగబడి చూస్తున్నారు. డబ్బులు ఇస్తున్నారు.

కానీ ఇవే సినిమాలు ఓటీటీలోకి వచ్చిన తరువాత… వీటిని చూసారా… ఏముంది ఇందులో… అంటూ ఒక్కో ఆడియన్స్ ఒక్కో రివ్యూ, అంతా కామెంట్లు పెడుతున్నారు. ఏకి ఏకి వదులుతున్నారు. ఇదో చిత్రమైన విషయం. ఓటీటీలో చూసిన వారు నిజానికి జస్ట్ సబ్‌స్క్రిప్షన్ మాత్రమే చేసి చూస్తారు. థియేటర్‌లో వందలు, వేలు ఖర్చు చేసి చూస్తున్నారు. అలా వందలు, వేలు ఖర్చు చేయడంతో నిర్మాతలకు కోట్లు వస్తున్నాయి. దాంతో తమ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అని అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

కానీ వన్స్ ఓటీటీలోకి వచ్చిన తరువాత చూసిన వాళ్లు మాత్రం సినిమాలను సోషల్ మీడియాలో ఏకి ఏకి పెడుతున్నారు. వీళ్లు ఆడియన్స్‌నే… వాళ్లు ఆడియన్స్‌నే. కేవలం ఫ్యానిజం తప్పించి తేడా లేదు. పైగా ఈవెంట్ సినిమాలను చూసేసి, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో “ఏమీ లేదు” అని పెడుతున్నవారు ఉన్నారు. కానీ ఈవెంట్ సినిమాల జోరుకు అవేమీ పెద్దగా బ్రేక్ వేయడం లేదు.

చిన్న, మిడ్ రేంజ్ సినిమాలను మౌత్ టాక్ ప్రభావితం చేస్తోంది హిట్ కావడానికి. కానీ భారీ ఈవెంట్ సినిమాలకు మాత్రం ఇలాంటి మౌత్ టాక్, సోషల్ మీడియా టాక్ ఏమీ చేయడం లేదు. వన్స్ “చూసేద్దాం” అనే క్రేజ్ ముందు ఇది నిలబడడం లేదు. ఆ క్రేజ్ ముందు డబ్బులుగా, తరువాత నెగెటివ్ ఒపీనియన్‌గా మారినా పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు భారీ సినిమాలను. ఇదో చిత్రమైన పరిస్థితి. ఇలా ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.

7 Replies to “డబ్బులిస్తున్నారు… తిడుతున్నారు.. చిత్రం కద!”

  1. The reason is theatre experience. Not as in bigger screen or sound. Watching the movie with multiple people adds an experience to the movie. You have to watch in one go. No forward or replay. No pause. All these features make bad movies worse in ott.

Comments are closed.