అజ్ఞాతంలోనే పేర్ని దంప‌తులు

పేర్ని దంప‌తుల కోసం మ‌చిలీప‌ట్నం పోలీసులు బృందాలుగా ఏర్ప‌డి విస్తృత గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

అజ్ఞాతంలోనే పేర్ని నాని దంప‌తులున్నారు. పేర్ని గోడౌన్‌లో 185 ట‌న్నుల రేష‌న్ బియ్యం క‌నిపించ‌క‌పోవ‌డంపై పౌర‌సంబంధాల శాఖ అధికారుల ఫిర్యాదు మేర‌కు మ‌చిలీప‌ట్నం తాలూకా పోలీసులు కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. వైసీపీ త‌రపున బ‌లమైన గొంతు వినిపించే పేర్నిని కూట‌మి స‌ర్కార్ టార్గెట్ చేసింది. ఈ నేప‌థ్యంలో పేర్ని నాని భార్య జ‌య‌సుధ పేరుతో ఉన్న గోడౌన్‌లో రేష‌న్ బియ్యం మాయం కావ‌డంతో కూట‌మి స‌ర్కార్ అవ‌కాశంగా తీసుకుంది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తార‌నే ఉద్దేశంతో పేర్ని దంప‌తులు వారం నుంచి క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు ముంద‌స్తు బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. పేర్ని జ‌య‌సుధ బెయిల్ పిటిష‌న్‌పై ఇవాళ తొమ్మిదో అద‌న‌పు జిల్లా కోర్టులో విచార‌ణ జ‌రిగింది. పోలీసుల నుంచి ఇంకా సీడీ రాక‌పోవ‌డంతో విచార‌ణ‌ను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు.

మ‌రోవైపు పేర్ని దంప‌తుల కోసం మ‌చిలీప‌ట్నం పోలీసులు బృందాలుగా ఏర్ప‌డి విస్తృత గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. బెయిల్ పొందేలోపు అరెస్ట్ చేసి క‌ట‌క‌టాల‌పాలు చేయాల‌ని ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌తో వుండ‌డంతో పోలీసులు తంటాలు ప‌డుతున్నారు. అయితే వారి ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో పోలీసులు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ముంద‌స్తు బెయిల్ వ‌చ్చే వ‌ర‌కూ పేర్ని దంప‌తులు బ‌య‌టికి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇంకెంత కాలం ప‌డుతుందో చూడాలి.

15 Replies to “అజ్ఞాతంలోనే పేర్ని దంప‌తులు”

    1. Ration biyyam enduku bayya… manaki Perni Nani and Perni Jayasudha ni arrest cheyadam kavali. paapam commom ppl idanta ration biyyam kosam anukuntunnaru. ado rakamga Perni couples lopaleseyali anthegaa.. anthegaa….

  1. Nuvvem rational bhayya. Neninintha varaku nee saamajika party against ga okka comment cheyaledu. Chaduvukunnavaadivi intha guddi prema yendi bhayya nee kulam pi. So disgusting. Manusuluga maarandi bhayya. Thappuni thappuga oppuni oppuga oppukondi bhayya. Meeru oppukorle bhayya mee naranarallo caste feeling andarikante meeru goppolu anukuntaru. Cheppulu choosi intloki raakunda poye jaathi need. Oka luchhani mee jaathi aaradya divamga bavinchi vaadi m jubuku jubuku cheekuthuntaru. Chee siggu leni janmalu. Vaadevado okadu maha kavi perutho vasthadu. Vaadoka waste naa ko duku. Inkokadu Ejay anta yee madhya kanapadatam le poyada yenti. Bhoomiki bharam thaggiddile. Pichha mundakodakallarra manusulantha okkate. Rd

    1. వైసీపీ నాయకులూ ఇంత పిరికి వాళ్ళా? గత ఐదేళ్లు ఎంత వేధించినా, జైల్లో పెట్టినా టీడీపీ నాయకులూ క్షేత్రాన్ని విడిచి వెళ్ళలేదు.

  2. ee potugadu media lo kaburlu cheptadu…cut cheste ration biyyam tinnadu…siggu vundali. ade ee pani TDP vallu chesunte nuvvu oka padi articles rase vadivi

  3. వైసీపీ నాయకులకి, ఏపీ పోలీసులకి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉందనుకుంటా. ప్రతి నాయకుడూ పరారీలోకి వెళ్లిపోతున్నాడు. అరెస్ట్ తప్పించుకుంటున్నాడు.

  4. అసలు బెయిల్ అప్లికేషన్ పెట్టినప్పుడు, కోర్ట్ ఆ అప్లికేషన్ తీసుకునేప్పుడే బెయిల్ రిజెక్ట్ అయితే సొంతంగా సరెండర్ అవ్వాలని రూల్ పెట్టాలి,అది ఏ నాయకుడికి అయినా.. బెయిల్ రిజెక్ట్ అంటే అర్ధం మారిపోతుంది..రిజెక్ట్ అవ్వంగానే

    అజ్ఞాతం అంటే కోర్ట్ తీర్పుని దిక్ఖరించినట్టెగా..

Comments are closed.