జపాన్ ఫ్యాన్స్ ను మిస్సయిన ప్రభాస్

షెడ్యూల్ ప్రకారం, దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్ మరో 2 రోజుల్లో టోక్యో వెళ్లాలి. కానీ ప్రమాదవశాత్తూ ప్రభాస్ గాయపడ్డాడు.

ప్రభాస్ కు జపాన్ లో కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఉన్న అభిమానుల తర్వాత, ప్రభాస్ అంటే అంత పిచ్చి ప్రేమ జపాన్ ఫ్యాన్స్ లోనే కనిపిస్తుంది. ఈ హీరో కోసం విమానం కట్టుకొని హైదరాబాద్ వచ్చిన జపాన్ అభిమానులు కోకొల్లలు.

ఇప్పటికీ సోషల్ మీడియాలో జపాన్ నుంచి ప్రభాస్ పేరు, బాహుబలి-2 సినిమా పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి తన డైహార్డ్ ఫ్యాన్స్ ను కలిసే అవకాశాన్ని ప్రభాస్ మిస్సయ్యాడు.

తాజా బ్లాక్ బస్టర్ కల్కి, జపాన్ లో విడుదలకు సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం, దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్ మరో 2 రోజుల్లో టోక్యో వెళ్లాలి. కానీ ప్రమాదవశాత్తూ ప్రభాస్ గాయపడ్డాడు. దీంతో అతడు తన జపాన్ టూర్ ను రద్దు చేసుకున్నాడు.

మరి ప్రభాస్ సినిమాల సంగతేంటి..?

ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. సెట్స్ పై 2 సినిమాలున్నాయి. వీటిలో ఒకటి రాజా సాబ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే ప్రభాస్ యాక్టివ్ గా ఉన్నాడు. అయితే సినిమాకు సంబంధించి టాకీ పూర్తయింది కాబట్టి, యూనిట్ కు టెన్షన్ లేదు. కోలుకున్న తర్వాత మిగతా వర్క్ పూర్తి చేసుకుంటారు.

ఇప్పటికిప్పుడు ఇబ్బంది హను రాఘవపూడి (ఫౌజీ) సినిమాకే. ఈమధ్యనే ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు ప్రభాస్. అంతలోనే గాయాల బారిన పడ్డాడు. ప్రభాస్ కోలుకునేంతవరకు ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి రాదు. గాయం ప్రభాస్ స్పిరిట్ మూవీపై కూడా పడే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే, వచ్చే నెల నుంచి స్పిరిట్ అనుకుంటున్నారు.

అయితే ప్రభాస్ కాలికి తగిలిన గాయం మరీ పెద్దది కాదంటోంది అతడి టీమ్. ప్రస్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడని, త్వరలోనే మళ్లీ షూటింగ్స్ కు వస్తాడని చెబుతోంది. ఎటొచ్చి టోక్యో టూర్ మిస్సవ్వడం, ఇటు ప్రభాస్ కు, అటు జపాన్ ఫ్యాన్స్ కు బాధ కలిగించే విషయం.

One Reply to “జపాన్ ఫ్యాన్స్ ను మిస్సయిన ప్రభాస్”

Comments are closed.