పేకాటలో భారీ దెబ్బ?

భారీగా అంటే లక్షల్లో కాదు, కోటి, రెండు కోట్ల పైనే అని టాక్ వినిపిస్తోంది

వృత్తి ఏదైనా కావచ్చు, పేకాట అంటే ప్రియంగా ఉండే వాళ్లు అన్ని రంగాల్లోనే ఉంటారు. అలాగే, సినిమా రంగంలో కూడా ఉంటారు. సినిమాల వర్క్ హడావుడి లేకుంటే ఏదో ఒక స్టార్ హోటల్‌లోనో, ఫార్మ్ హౌస్‌లోనో చేరి లేట్ నైట్ వరకు పేకాట ఆడే నిర్మాతలు, సినిమా జనాలు చాలా మంది ఉంటారు.

పెద్ద హీరోలు అయితే బయటకు రావు. వాళ్ల ఇళ్లకే సన్నిహితులైన నిర్మాతలు, ఫ్రెండ్స్ వెళ్లి అక్కడే ఆడతారు. టాలీవుడ్‌లో ఇలా పేకాటలు ఆడే రకరకాల గ్రూపులు ఉన్నాయి. కొన్ని గ్రూపుల్లో పెద్ద నిర్మాతలు, వారికి సన్నిహితులైన రాజకీయ నాయకులు కూడా ఉంటారు. కొన్ని గ్రూపుల్లో యంగ్ నిర్మాతలు మాత్రమే ఉంటారు. ఇలా రకరకాల గ్రూపులు.

ఇటీవల ఓ గ్రూపులో ఉన్న పెద్ద నిర్మాత ఒకరు భారీ మొత్తం పేకాటలో పోగొట్టుకున్నట్లు గాసిప్ వినిపిస్తోంది. ఈ నిర్మాతకు పేకాట అంటే చాలా ఇష్టం. ఒక్క రోజు కూడా పేకాట ఆడకుండా ఉండలేరని టాక్. పైగా, వింటే షాక్ అయ్యేంత స్టేక్‌లో ఆడతారనే టాక్ కూడా ఉంది. ఇలా నిత్యం పేకాట ఆడే వారు డబ్బు గెలవడం, ఓడడం అన్నది చాలా కామన్.

అయితే ఇప్పుడు ఎందుకు గాసిప్స్‌లోకి వచ్చింది అంటే, ఈ మధ్య కాస్త భారీగా డబ్బులు ఓడిపోయారని వినిపిస్తోంది కనుక. భారీగా అంటే లక్షల్లో కాదు, కోటి, రెండు కోట్ల పైనే అని టాక్ వినిపిస్తోంది. పేకాటలో అంత డబ్బు పోతుందా అంటే, ఆడే స్టేక్ అదే రేంజ్‌లో ఉంటే పోవడం, రావడం అనేది అలాగే ఉంటుంది. అయినా పెద్దగా బాధపడే నిర్మాత కాదు. అసలు ఏదీ పైకి తేలకుండా గుంభనంగా ఉండే, ఎలాంటి ఫీలింగ్‌లు ఫేస్‌లో కనిపించకుండా ఉండే నిర్మాత. అసలు ఆ మాటకు వస్తే బయటకు పెద్దగా రాని నిర్మాత. అదీ సంగతి.

9 Replies to “పేకాటలో భారీ దెబ్బ?”

  1. వీటిని ఉబుసు పోక కబుర్లు అంటారు . ఇటువంటి వాటితో ఏమైనా లాభమా అంటే ఇటువంటి ఉబుసు పోక పోస్ట్ పెట్టిన వారే చెప్పాలి

  2. అప్పట్లో పేకాట క్లబ్ లో ఖాతాల కింద రాష్ట్రం మొత్తం నుండి, ప్యాలస్ కి నెలకి 25 కోట్లు కమీషన్ వచ్చేవి అంట , నిజమేనా.

    అందుకే కాబోలు, వూరికి ఒక ప్యాలస్ కట్టాడు.

Comments are closed.