కర్ణాటకలో బెడిసికొట్టిన ఉచిత బస్సు ప్రయాణం

తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు కర్ణాటక పరిస్థితే వచ్చి తీరుతుంది.

ప్రతీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలపై ఉచితాల వల వేస్తున్న వైనం దశాబ్దాలుగా చూస్తున్నాం. ఉచితాలు అనర్ధదాయకమని ఆర్ధిక నిపుణులు, సుప్రీం కోర్టు మొత్తుకుంటున్నా ప్రభుత్వాలకు పట్టడంలేదు.

ఇబ్బడిముబ్బడిగా ఉచిత పథకాలు అమలు చేస్తుండటంతో ప్రభుత్వాలు ఆర్ధిక భారాన్ని మోయలేక ఆ పథకాలను పంటిబిగువన కొనసాగిస్తూ ప్రజలపై మరో రూపంలో భారాలు మోపుతున్నాయి. ప్రజలు కూడా ఉచిత పథకాలకు బాగా అలవాటు పడిపోయారు. వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. ఒకసారి ఉచిత పథకాలు ప్రారంభించక మధ్యలో వాటిని ఉపసంహరించుకుంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

మరోసారి ఆ పార్టీ అధికారంలోకి రాదు. ఇప్పుడు కర్ణాటకలో అదే జరిగింది. అక్కడ అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. కానీ అది కాలక్రమంలో ప్రభుత్వానికి గుదిబండగా మారింది. ఏడాదికే ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వానికి భారమై పోయింది.

ఆ పథకాన్ని కొనసాగించనూలేదు, ఉపసంహరించునూకోలేదు. మరేం చేయాలి. టిక్కెట్లు తీసుకొని ప్రయాణించేవారిపై భారం మోపాలి. అంటే బస్సు చార్జీలు పెంచాలి. సిద్ధ రామయ్య ప్రభుత్వం ఆ పనే చేసింది. ఆర్టీసీ బస్సు చార్జీలను ఏకంగా పదిహేను శాతం పెంచింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆ రాష్ట్రంలోని రోడ్డు రవాణా సంస్థలకు భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో అవి చార్జీలు పెంచాలని ప్రతిపాదించగానే ప్రభుత్వం వెంటనే అంగీకరించి చార్జీలు పెంచేసింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆ రాష్ట్రంలో నాలుగు ఆర్టీసీలకు వెయ్యి కోట్లకు పైగా నష్టం వచ్చింది. చివరకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

ఆర్టీసీలు దివాలా తీసే స్థితికి చేరుకున్నాయి. గుదిబండగా మారిన ఈ ఉచిత పథకాన్ని ఎత్తేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. మహిళలు కూడా తాము టిక్కెట్లు కొనుక్కొని ప్రయాణిస్తామన్నారు. కానీ పథకాన్ని సమీక్షించే పేరుతో ప్రభుత్వం ఆ ప్రయత్నాలు విరమించుకుంది.

చివరకు టిక్కెట్ కొని ప్రయాణించే వారిపై భారం మోపింది. తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు కర్ణాటక పరిస్థితే వచ్చి తీరుతుంది.

22 Replies to “కర్ణాటకలో బెడిసికొట్టిన ఉచిత బస్సు ప్రయాణం”

  1. This is one of the worst freebies, useless and needless. No one will be thankful to the government.

    People will not vote in favor of ruling party based on this freebie in next election.

  2. కెవలం ఉచ్చితాలని నమ్ముకొని, బుటన్లు కొక్కటమె పాలనగా పాలించెది మన జగన్ అన్నెనె!

    1. కనీసం ఆ బటన్ లు నొక్కడం కూడా చేత కావడం లేదు.. లక్షా పాతికవేల కోట్లు అప్పు ఎం చేశారో ఇంత వరుకూ లెక్క పాత్రా లేదు.. పోనీ ఏమైనా డెవలప్ చేశారా అంటే, దోచుకోవడం తప్ప ఇంకోటి ఇంతవరకూ లేదు..

  3. ఈ స్కీం వల్ల ఎన్నో ప్రయోజనలుఉన్నాయనిపిస్తుంది. Infact స్కీంని అందరికీ ఎక్స్టెండ్ చెయ్యాలి (atleast సిటీస్ లో). పబ్లిక్ ట్రాన్స్పోర్టుని ఎంకరేజ్ చెయ్యడంవల్ల రోడ్స్ మీద ట్రాఫిక్ tremendous గా తగ్గుతుంది. మన ఆయిల్ బిల్ చాలా తగ్గుతుంది. Foreign exchange చాలా సేవ్ అవుతుంది. కరెంటు అకౌంట్ డెఫిసిట్ న్యూట్రల్ అవుతుందేమో. రోడ్స్ మీద ట్రాఫిక్ తగ్గడం వల్ల రోడ్ మైంటెనెన్సు, widening వర్క్స్ తగ్గుతాయి. అక్కడ చాలా సేవ్ అవుతుంది. ప్లస్ తక్కువ వెహికల్స్ వల్ల ఎన్విరాన్మెంట్కి ఎంతో మేలు జరుగుతుంది. మైనస్లు కూడా వున్నాయి.

    1. అందరు ఆదాయ పన్ను కడితే , అప్పుడు అందరికీ ఉచిత బస్ ప్రయాణం ఇవ్వోచు.

      పన్నులు కట్టేది ఏమో కష్టపడి ఉద్యోగాలు చేసే జనాలు, ఉచితం ఏమో పన్ను కట్టకుండా వుండే జనాలకా?

  4. ఈ విషయం లో సీబీన్ ని అభినందించాలి..తెరగా వచ్చిన వాటిని కొంతమంది ఎలావాడతారో ఆలోచించి అలాంటి వాటిని ప్రత్యేకసందర్భాలలో పరిమితమిగా అమలు చేయాలనుకోడం..

  5. ఫ్రీ గా ట్రావెల్ చేసే వాళ్ళ నుదుట మీద ఒక స్టాంప్ వెయ్యాలి, నేను ఫ్రీ గా ట్రావెల్ చేశాను, ప్రజల పన్ను డబ్బుతో అని.

    1. బాబు నుదుటిమీద కూడాదొం గ అని స్టాంప్ వెయ్యాలి . ఎందుకంటే దొంగ హామీలు గెలిచాడు

  6. అవును బాబు నుదుటిమీద కూడా దొంగ అని మొదలెయ్యాలి ఎందుకంటే దొంగ హామీలుతో గెలిచాడు

  7. Free bus should ban other wise కంపెనీ మూతబడీ పోతుంది. వోటు రాజకీయ కు జనం బలీ, మన డబ్బులు తోనే ఇస్తారు ఖాన్ గ్రెస్ ఇంట్లో నుండి కాదు, హిమాచల్ లో పథకాలు ఆపేసీ డబ్బులు పెట్టాలీ వెళ్ళాలి, పంజాబ్ ఢిల్లీ హర్యానా కర్ణాటక దివాళ తీసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాగ్రత్త పడాలీ.

Comments are closed.