మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో దాఖలు చేసిన తన రిట్ పిటిషన్‌పై తానే వాదనలు వినిపించడం విశేషం. న్యాయ విద్యను అభ్యసించిన అంబటి రాంబాబు, వృత్తిగా మాత్రం ఎంచుకోలేదు. 1980వ దశకంలో జిల్లా కోర్టులో న్యాయవాదిగా వాదనలు వినిపించినట్టు ఆయన తెలిపారు.
ఏపీ హైకోర్టులో వాదనల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 19న పట్టాభిపురంలో ఐదు ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు. అయితే వాటిపై పోలీసులు కేసుల్ని రిజిస్టర్ చేయలేదన్నారు. సదరు పోలీసులు, అలాగే గుంటూరు పోలీస్ ఉన్నతాధికారి చట్టం ప్రకారం విధుల్ని నిర్వర్తించలేదన్నారు. అయితే రిట్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఇటీవల నాలుగు ఫిర్యాదులపై కేసులు రిజిస్టర్ చేసినట్టు తనకు సమాచారం ఇచ్చారన్నారు.
అయితే తనపై అభ్యంతరకర పోస్టు పెట్టిన ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై, అలాగే ఐదో ఫిర్యాదులో పేర్కొన్న నారా లోకేశ్‌పై మాత్రం కేసులు నమోదు చేయకుండా పోలీసులపై ఒత్తిళ్లు వచ్చినట్టున్నాయన్నారు. దీంతో న్యాయస్థానం ఆశ్రయించి, కేసులు నమోదు చేయొచ్చనే సందేశాన్ని పంపడానికి ఇది దోహదం చేసిందన్నారు.
తన ఆవేదన, బాధ, ఆక్రోశాన్ని తాను మాత్రమే సరైన రీతిలో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లొచ్చనే ఉద్దేశంతో ఈ పిటిషన్‌కు ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించుకోలేదన్నారు. కోర్టు తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని అంగీకరించిందన్నారు. వాదనలు వినిపించానన్నారు. అయితే ప్రభుత్వ తరపున వివరాలు సమర్పించడానికి కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసినట్టు అంబటి రాంబాబు తెలిపారు.
ఎంచుకున్న కొంతమందినే లోకేష్ టార్గెట్ చేస్తున్నాడు అదే మా “A1 ఐటమ్ గాడ్ని” ఇంకా ప్యాలెస్ లో నుండి బైటకి ఈడ్చి దె0గడం లేదని ఆంబోతుగాడి భాధ..
Iam a FAN of Ambothu రాంబాబు dancing స్కిల్స్.. Court లో dance చేస్తూ వాదిస్తే సూపర్ గా ఉంటది కదా గ్యాసు??
Court లో తేడా రాకుండా, ఎందుకైనా మంచిది సంజనా & సుకన్య ని అటు ఇటు ఉంచుకుని.. ” వీళ్ళు మీకేమైనా చెయ్యగలరా” అని అడుగు ఆంబోతు రాంబీ గా.
ante …swayam sevakudu anna maata
PK sir ni geli chesthu road meeda dance lesinantha easy kaadu ani ippudu ardham ayivuntundi.