కూట‌మి స‌ర్కార్‌కు అదే శాప‌మైందా?

టీడీపీకి బ‌ల‌మైన మీడియా వ్య‌వ‌స్థ ఉన్న‌ప్ప‌టికీ, ప్ర‌భుత్వంపై సాగుతున్న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని అడ్డుకోలేక‌పోతోంది.

కూట‌మి శ్రేణులు భ‌య‌ప‌డినట్టే జ‌రుగుతోంది. కేవ‌లం ఆరు నెల‌ల పాల‌న‌కే తీవ్ర వ్య‌తిరేక‌త చ‌విచూస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వానికి అదే శాప‌మైంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీర‌గానే చేసిన మొట్ట‌మొద‌టి ప‌ని…తాడేప‌ల్లిలో వైసీపీ కార్యాల‌య నిర్మాణాన్ని నేల‌మ‌ట్టం చేసింది. గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే, ప్ర‌జావేదిక కూల్చివేత‌తో మొద‌లు పెట్టింది. అందుకే ఎన్నిక‌ల్లో కూలిపోయింద‌న్న ప్ర‌చారం వుంది.

కూట‌మి ప్ర‌భుత్వం ఏదైనా మంచి ప‌నితో మొద‌ల‌వుతుంద‌ని అంద‌రూ ఆశించారు. అదేంటో గానీ, కూల్చివేత‌తో మొద‌లు పెట్టింది. అప్పుడే ముఖ్యంగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో తెలియ‌ని భ‌యం ఏర్ప‌డింది. గ‌తంలో వైసీపీ చేసిన త‌ప్పుల్నే, మ‌నం కూడా చేస్తున్నామా? అనే అనుమానం క‌లిగింది. వాళ్ల అనుమానం, భ‌యం నిజ‌మ‌వుతున్నాయి.

టీడీపీకి బ‌ల‌మైన మీడియా వ్య‌వ‌స్థ ఉన్న‌ప్ప‌టికీ, ప్ర‌భుత్వంపై సాగుతున్న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని అడ్డుకోలేక‌పోతోంది. దీనికితోడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం దోపిడీకి తెర‌లేపార‌న్న ప్ర‌చారాన్ని కొట్టి పారేయ‌లేని ప‌రిస్థితి. ఇవాళ టీడీపీ అనుకూల ప‌త్రికలో సామ‌ర్ల‌కోట‌-రాజాన‌గ‌రం రోడ్డు విస్త‌ర‌ణ‌కు గ్రావెల్ త‌ర‌లించేందుకు అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధే అడ్డు త‌గులుతున్నాడ‌నే క‌థ‌నాన్ని చ‌ద‌వొచ్చు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం చెప్పినా ఖాత‌రు చేయ‌లేద‌ని రాయ‌డం ఇందులో కొస‌మెరుపు.

గ‌త ఐదేళ్ల‌లో వైసీపీ విధ్వంసానికి పాల్ప‌డింద‌ని, దాన్ని స‌రి చేస్తున్నామ‌ని చంద్ర‌బాబునాయుడు నీతులు చెబుతున్నారు. మ‌రోవైపు ఆయ‌న పాల‌న‌లో అంత‌కు మించి జ‌రుగుతోంద‌ని, వాళ్ల ప‌త్రిక‌లే అప్పుడ‌ప్పుడు నిజాలు రాస్తున్నాయి. వాస్త‌వ ప‌రిస్థితి ఇట్లా వుంటే, ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రాకుండా ఏమొస్తుంది? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. దీనంత‌టికి కూల్చివేత‌తో పాల‌న ప్రారంభించ‌డ‌మే కార‌ణ‌మ‌నే చ‌ర్చ టీడీపీలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది.

32 Replies to “కూట‌మి స‌ర్కార్‌కు అదే శాప‌మైందా?”

  1. అమ్మొ! అదెమి సొల్లు రా! నువ్వు చెప్పె అబ్ద్దలకి హద్దెలెదా? తీవ్రమయిన వ్యతిరెకతా? కామెడీలు వద్దురా!

    నువ్వు రాజదాని సీడ్ యాసిస్ రొడ్డుకి అడ్డంగా నెషెదిత ప్రంతంలొ అనుమతులు కూడా లెకుండా నీ పార్టి office కొసం కట్టటం మొదలు పెడితె కట్టనివాలా? భవిషత్తులొ రాజదానికి రొడ్డు కూడా లెకుండా నువ్వు కుయుక్తులు పన్నితె చూస్తూ ఊరుకుంటారా?

    ఒక్కసారి రాజదానిలొ అడుగు పొ! దీని మీద వ్యతిరెకథ ఉందా అని?

  2. ఇక ఎందుకు మరి మన ఈశ్వర్ గాడిని,కొమ్మిగాడిని పిలిపించి డబ్బులు…జేజేలు కొట్టించండి’)

  3. “ఆరు నెల‌ల పాల‌న‌కే తీవ్ర వ్య‌తిరేక‌త చ‌విచూస్తోంది”..its actually opposite of what you are hoping…we want lucha fellows to treated like luchas…

  4. వూకో గ్రేట్ ఆంధ్రా!సచ్చిన పాము గురుంచి మాకు ఈ సోది..అంత పొడుగు,ఇంత పొడుగు,పడగ ఇప్పుద్ధి,బుస కొట్టుద్ధి..మంగళవారం కబుర్లు..

    వాడేమో ఎంత తొందరగా లండన్ పోయి బిళ్ళలు తెచ్చుకుందామ అని కోర్ట్ ల చుట్టూ తిరుగుతూ వున్నాడు..నువ్వేమో ఇక్కడ మాకు ఇక్కడ మ్యూజిక్ ఎస్తున్నావు.

  5. ////ఆరు నెల‌ల పాల‌న‌కే తీవ్ర వ్య‌తిరేక‌త చ‌విచూస్తోంది////

    6 నెలల్లు అవుతున్నా అన్న ప్యలెస్లొ తొంగుంటె, పాపం బులుగు బ్యచ్ కి ఫస్ట్రెషన్ పెరిగి పెరిగి ఇలా పిచ్చి పిచ్చి గా మాటాడుతున్నరు!

  6. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యాలయాన్ని కూల్చేసిందా..? ఆ ముక్క నువ్వు చెప్పేవరకు మాకు ఎవరికీ గుర్తు లేదు..

    జనాలకు కూడా గుర్తు లేదు.. గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు..

    జగన్ రెడ్డి సంకలు నాకే నీకు వైసీపీ కార్యాలయం ఒక దేవాలయం లాగా కనిపించొచ్చు.. కానీ రాష్ట్ర ప్రజలకు అదొక పిశాచాల దిబ్బ ..

    కూల్చేసి మంచి పని చేశారు అనుకుని ఉంటారు.. ఆ విషయం మర్చిపోయి కూడా ఉంటారు.. మళ్ళీ గుర్తు చేయకు..

  7. “అసలు అన్ని పాలస్ లో కూల్చి పార దొబ్బలి. ప్రజా సొమ్ముని సొంత సొమ్ము గా వాడుకు దొబ్బి రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసాడు”. ఇది ప్రజల ముఖ చిత్రం .

  8. వ్యతిరేకత వొచ్చింది అనుకుంటే .. ballot paper తో పెట్టిన ఎన్నికలు ఎందుకు పోటీ చేయలేదో? పోటీచేసి గెలిచి నిరూపించికోవాల్సిందిగా ..

  9. 30 ఏళ్ళు అధికారం మాదే నని ..మీరు భ్రమ పడ్డారు.. అధికారం శాశ్వతం కాదు అవి వారు భావిస్తున్నారు..ఏది కరెక్ట్

  10. ఇంతకుముందు మీ రౌడీ జగన్ను ప్రజలు సీఎం చేశారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో. కానీ మీ జగన్ పరిపాలన లోకి రాగానే రౌడీయిజం స్టార్ట్ చేశాడు. దీన్ని ప్రజలు ఊహించలేకపోయారు. మీకు రౌడీయిజం తప్ప పరిపాలన చేతకాదని ప్రజలు ఆలోచించి వెనక తిప్పుకొట్టారు. అయినా సి గ్గు లేదు.

    1. inthaku mee babu first time paripalanaloki ela vachhadu, vennupotu podisthe, mama ni himshinchi vennupotu podisthe vachhadu…ayana tharvatha odipoleda..malli gelavaleda…

      1. పాదయాత్ర చేసి పార్టీ ని నిలబెట్టిన చెల్లి తరువాత పదవులకి ఎందుకు పానికిరాలేదు స్వామి దీన్ని ఏమి పోటు అంటావు?

  11. ఎన్ని కష్టాలు పడ్డామో అధికారం లోకి వచ్చాం ,

    మన తల్లి లాంటి భువనమ్మకి పరాభవం జరిగినా ,

    తండ్రి లాంటి సీబీన్ జై లుకు పోయినా ఓర్చుకుంది ఆంధ్రప్రదేశ్ కోసం మళ్ళీ ఆ దుర్మార్గుడు చేతిలోకి మాత్రం రాష్ట్రం ఇవ్వము .

  12. సింపుల్ గా సుత్తి లేకుండా ABN RK ఏమి చెప్పాడంటే

    1.జగన్ కి తొక్క తీసి తోలు ఎండగట్టు, వాళ్ళ బతుకెంత వాళ్ళెంత

    2. లోకేష్ కి పగ్గాలివ్వు

    3.ఎమ్మెల్యే లను, మంత్రులను కంట్రోల్ లో పెట్టు

    4.ఒక సీఈఓ లాగా కాదు, ఒక కరుడు కట్టిన రాజకీయ నాయకుడి అవతారం ఎత్తు.

Comments are closed.