గేమ్ ఛేంజర్ మీద ‘చిరు’ నమ్మకం

సినిమాను తాను రెండు సార్లు చూసానని, వెనక్కు చూసుకోవాల్సిన పరిస్థితి లేదని, ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు అనే విధంగా మెగాస్టార్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

తనయుడు రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ మీద తండ్రి మెగాస్టార్ చిరు బలమైన నమ్మకంతో వున్నారు. నిన్నటికి నిన్న మెగా ఫ్యాన్స్ ను చిరంజీవి కలిసారు. ఆయన మాట్లాడిన మాటలు మామూలుగా లేవు. చరణ్ ఈ సినిమాలో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని మరోసారి చెప్పారు.

సినిమాను తాను రెండు సార్లు చూసానని, వెనక్కు చూసుకోవాల్సిన పరిస్థితి లేదని, ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు అనే విధంగా మెగాస్టార్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దాదాపు ఇవే విషయాలను మెగాస్టార్ తనతో పంచుకున్నారని నిర్మాత దిల్ రాజు వేదిక మీదే చెప్పారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా ఫ్యాన్స్ తో నేరుగా ఇవే విషయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ప్రసంగం ఆద్యంతం ఫ్యాన్స్ ఉత్సాహంతో ఊగిపోయారు. ఫ్యాన్స్ అందరినీ పలకరించి, ఫోటోలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ ఇలా ఫ్యాన్స్ తో నేరుగా ఇంట్రాక్ట్ అయి చాలా కాలం అయింది. గతంలో ఇలాంటి సమావేశాలు ఎక్కువగా నాగబాబు నిర్వహించేవారు. ఈసారి మెగాస్టార్ నే స్వయంగా రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా అయింది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమాకు ఇనఫ్ బజ్ వచ్చింది. శుక్రవారం విడుదలవుతోందీ సినిమా. ఏపీ లో స్పెషల్ షోలు, రేట్లు వచ్చాయి. తెలంగాణ సంగతి ఈ రోజు తెలుస్తుంది.

7 Replies to “గేమ్ ఛేంజర్ మీద ‘చిరు’ నమ్మకం”

  1. అంత చిత్రము ఉన్నట్టు అనిపించడం లేదు. Rrr ను దాటితే గ్రేట్

Comments are closed.