కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన మీద చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఇంతకూ నాగేందర్ ఏం చేశాడు? గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం తనకు పార్టీలో ప్రాధాన్యం లేదని అసంతృప్తితో ఉన్నాడో ఏమో, ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడాడు.
అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. దానం నాగేందర్ పేరు తెలియనివారుండరు. ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆ తరువాత గులాబీ పార్టీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి ఫిరాయించాడు. ఆయన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిలబెట్టారు, కానీ ఓడిపోయాడు.
తాజాగా దానం నాగేందర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు పూర్తి మద్దతు ఇచ్చాడు. కేటీఆర్ ప్రస్తుతం ఫార్ములా రేసు కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఏసీబీ విచారణకు కూడా వెళ్లి వచ్చారు. ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్‌ను సమర్థిస్తూ మాట్లాడాడు. కాంగ్రెస్ పాలనపై విముఖత వ్యక్తం చేశాడు. ఫార్ములా రేసు కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పాడు. దీంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది పక్కన పెడితే, హైదరాబాదుకు మేలు జరిగిందని అన్నాడు. ఇందులో అవినీతి ఏమైనా జరిగి ఉంటే వెంటనే బయట పెట్టాలని అన్నారు.
హైడ్రాను కూడా దానం విమర్శించాడు. హైడ్రా కూల్చివేతల వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని అన్నాడు. హైడ్రా కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని పేర్కొన్నాడు. చిన్న తప్పులను భూతద్దంలో చూస్తున్నారని చెప్పాడు.
గులాబీ పార్టీలో ఉన్నప్పుడు తనకు పదవి లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తనకు పదవి లేదని, కావాలని కూడా అడిగానని దానం చెప్పాడు. కాంగ్రెస్ కార్యకర్తల్లో బాగా నిరుత్సాహం ఉందన్నాడు. హైదరాబాదులో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, ఎందుకంటే పార్టీపై ప్రజలకు నమ్మకం లేదని అన్నాడు. ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నామని, హైడ్రా కారణంగా ఇది మరింత ప్రమాదకరంగా మారిందని అన్నారు.
కేసీఆర్ భోళా శంకరుడని, గొప్ప నేత అని దానం ప్రశంసించాడు. ఆయన తెచ్చిన పథకాలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. దీన్నిబట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ చాలా అసంతృప్తిగా ఉన్నట్లు అర్థమవుతోంది.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
ప్లే బాయ్ వర్క్:- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
పార్టీ మారమన్న వాడెవడు ఇలా ఏడవమన్న వాడెవ డు ?
gu baruvu ayyindi twarlo taggutundi le
మంత్రి పదవి దానం చెయ్యలేదని డ్రామా ఆడుతున్నాడు.