నాగ్…రామ్ …కాంబినేషన్?

వైల్డ్ డాగ్ సినిమాను పూర్తి చేసి, తరువాత ప్రాజెక్టుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు సీనియర్ హీరో నాగార్జున. ఆ తరువాత సినిమా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో చేయాల్సి వుంది.  Advertisement అలాగే సోగ్గాడే చిన్ని…

వైల్డ్ డాగ్ సినిమాను పూర్తి చేసి, తరువాత ప్రాజెక్టుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు సీనియర్ హీరో నాగార్జున. ఆ తరువాత సినిమా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో చేయాల్సి వుంది. 

అలాగే సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు కూడా ప్లానింగ్ లో వుంది. అన్నీ అనుకున్నట్లు అయి వుంటే ప్రవీణ్ సత్తారు సినిమా ప్రారంభమయ్యేది. కానీ ఇప్పడు తేడా వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రవీణ్ సత్తారు సినిమాను హోల్డ్ లో వుంచారు. బంగార్రాజు సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. అయితే చిరకాలంగా బంగార్రాజు సినిమాకు ఒకటే సమస్య. నాగ్ చైతన్య డేట్ లు కావాలి. కానీ చైతన్య ఫుల్ బిజీగా వున్నాడు. 

థాంక్యూ, ఆ తరువాత ఇంద్రగంటి సినిమాలు వున్నాయి. ఆ తరువాత లేదా మధ్యలో వెంకీ అట్లూరితో ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా వుంది. అందుకే నాగ్ కూడా చైతన్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, వేరే హీరోతో వెళ్లాలని చూస్తున్నారని బోగట్టా. 

యంగ్ హీరోల్లో ఎవరి కాంబినేషన్ తో అయినా వెళ్లాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్ చాయిస్ రామ్ అని వినిపిస్తోంది. రామ్ తో అయితే సినిమాకు పక్కా మల్టీ స్టారర్ లుక్ వస్తుంది. రామ్ తో సెట్ కాక పోతే మరెవరు అయితే బాగుంటుందనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. గతంలో నానితో చేసారు. ఇక వేరే ఆఫ్షన్లు అంటే నాగశౌర్య పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అతి చేస్తోన్న మీడియా

ఎందుకు పెదవి విప్పాలి?