కోట్ల రెమ్యునరేషన్లు.. పుల్లింగ్ జీరో

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఏడాది తరువాత మిడ్ రేంజ్ సినిమాలు మెలమెల్లగా మాయం అయిపోయే ప్రమాదం వుంది.

ఒక హీరో పది కోట్లు. మరో హీరో ఎనిమిది కోట్లు.. చాలా మంది హీరోలకు వరుస ఫ్లాపులు. ఫ్లాపుల మీద ఫ్లాపులు. అయినా రెమ్యూనిరేషన్ తగ్గదు. సినిమాలు తీయడం ఆగదు. కానీ విడుదల వరకు వస్తే కనీసం మినిమమ్ ఓపెనింగ్ వుండడం లేదు. కానీ నిర్మాతలు మాత్రం ఈ ఫ్లాపుల హీరోల వెంట ఎగబడి మరీ సినిమాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి హిట్ అంటే తెలియని, హిట్ కు మొహం వాచిన హీరోలకు సైతం ఎనిమిది కోట్లు, పది కోట్లు ఇచ్చి సినిమాలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి. తీరా సినిమా విడుదలయ్యే సరికి కనీసం ఇచ్చిన రెమ్యూనిరేషన్ లో పదిశాతం మేరకు కూడా తొలి రోజు ఓపెనింగ్ వుండడం లేదు.

రాబిన్ హుడ్ 70 కోట్లకు పైగా ఖర్చు, లైలా 25 కోట్లు.. మజాకా 27 కోట్లు.. జాక్ 35 కోట్లు.. దిల్ రుబా లెక్కలు తెలియాల్సి వుంది.. ఈ సినిమాలు ఏవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. నాన్ థియేటర్ అమ్మకాలు కొంత వరకు పెట్టుబడిని కవర్ చేసాయి. కానీ థియేటర్ మీద రావాల్సిన మొత్తాలు రాకపోవడంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు.

మిడ్ రేంజ్ హీరోలు ఎవ్వరూ అయిదు కోట్లకు లోపు తీసుకోవడం లేదు. అయిదు నుంచి పది కోట్ల మధ్యలో పలుకుతున్నాయి రెమ్యూనిరేషన్లు. జాక్ సినిమాకు దాదాపు 35 కోట్లు ఖర్చయింది. విడుదల టైమ్ కు పాతిక కోట్లు రికవరీ కావడం కష్టం అయింది. పైగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు అందించిన అట్టర్ ఫ్లాప్ సినిమా గాండీవధారి అర్జున సినిమా పాపాలు అన్నీ జాక్ మీద పడ్డాయి.

బెల్లంకొండ.. మనోజ్, రోహిత్‌లతో తీసిన భైరవం సినిమా నాన్ థియేటర్ అమ్మకాలు జరగక, విడుదల డేట్ గురించి కిందా మీదా అవుతోంది. ఆ సినిమాకు 40 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇంద్రగంటి లాంటి దర్శకుడు ప్రియదర్శి లాంటి చిన్న హీరోతో సినిమా తీసారు. దాదాపు ఇరవై కోట్లకు పైగా ఖర్చు. నో సేల్స్. సినిమా, హీరో, మార్కెట్ లెక్కలు తెలియకుండా దర్శకుడు ఇలా ఖర్చు చేయించేస్తే నిర్మాత గతేం కావాలి?

మన హీరోల్లో గోపీచంద్, శర్వానంద్, నితిన్, వరుణ్ తేజ్, బెల్లంకొండ, వీళ్లంతా హిట్ కొట్టి చాన్నాళ్లయింది. కానీ వీళ్లందరూ అయిదు కోట్లకు పైగా పది కోట్లకు లోపున రెమ్యూనిరేషన్లు తీసుకుంటున్నారు. మన హీరోలు ఎవ్వరూ కూడా ప్రాఫిట్ షేరింగ్ పద్దతికి సిద్దంగా లేరు.

ఇటీవల కాలంలో థియేటర్ మీద లాభాలు సంపాదించాం అని చెప్పుకోగలిగిన పెద్ద సినిమా సంక్రాంతికి వస్తున్నాం. చిన్న సినిమా కోర్ట్. మరే సినిమా కూడా ఈ దరిదాపుల్లో లేదు. డాకూ మహరాజ్ లాంటి సినిమా అలా అలా బయ్యర్లు సేఫ్ అయ్యారు అనిపించింది. మ్యాడ్ 2 సినిమా నిర్మాతకు లాభమే. ఎందుకంటే చిన్న సినిమా, నాన్ థియేటర్ అమ్మకాల రూపంలో మంచి మొత్తం వచ్చింది. కానీ నైజాం, వైజాగ్ మినహా మిగిలిన ఏరియాలు అలా అలా బ్రేక్ ఈవెన్ కు చేరుకున్నాయంతే.

ఒకప్పుడు సినిమా మాత్రమే వినోదం. ఇప్పుడు సినిమా కూడా ఒక వినోదం. దానికి మించి, ఖర్చు లేనివి అనేక వినోదసాధనాలు వచ్చాయి. విండో షాపింగ్ పెరిగింది. క్రికెట్ వుండనే వుంది. ఎంటర్ టైన్ మెంట్ జోన్ లు, కెఫే లు ఇలా చాలా అవకాశాలు వున్నాయి కుర్రకారు ఛిల్ కావడానికి.

గతంలో మాదిరిగా ఇప్పుడు సెలవులు అంటే సినిమా మాత్రమే కాదు. సెలవులు తగ్గిపోయాయి. సెలవులు దొరికితే వేరే పనులు చక్క బెట్టుకోవడం, ప్రయాణాలు పెరిగాయి. సినిమాలు వెనుక పడ్డాయి. కానీ మన నిర్మాతలు ఇంకా సెలవుల మీదనే దృష్టి పెడుతున్నారు. వరుస సెలవులు వస్తే చాలు నాలుగైదు సినిమాలు వచ్చి పడిపోతున్నాయి.

సినిమాను ప్రేక్షకుడు చూసే తీరు మారింది. మంచి సినిమా, చెడ్డ సినిమా అన్నది కాదు ఇప్పుడు కాన్సెప్ట్. ఓటీటీ సినిమా, థియేటర్ సినిమా అన్నది క్లాసిఫికేషన్. ఈవెంట్ సినిమాల అంటే థియేటర్ కు వస్తున్నారు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు అంటే, విడుదలై టాక్ వచ్చిన తరువాత, అందరూ అద్భుతం అంటే అప్పుడు థియేటర్ కు కదులుతున్నారు. అప్పుడు కూడా మీడియాను, సోషల్ మీడియాను నమ్మడం తగ్గింది. వాళ్ల వాళ్ల సోర్స్ ల్లో కన్ ఫర్మ్ చేసుకున్నాకే చూడడమా? మానడమా అన్నది వుంటోంది.

ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో హీరోలు ఓ మెట్టు దిగాల్సి వుంది. కానీ దిగడం లేదు. ఎందుకంటే ఎవరో ఒక నిర్మాత దొరుకుతారు. అలా దొరుకుతున్నపుడు ఎందుకు తగ్గాలి అనేట్లు వున్నారు.

29 Replies to “కోట్ల రెమ్యునరేషన్లు.. పుల్లింగ్ జీరో”

  1. “సింగల్ సింహం” ఏ సింహం వీర్యం తో పుట్టిందో ఎలా పుట్టిందో ఒక historical మూవీ మావోడు తీస్తున్నాడు.. లండన్ లాపకీలు హీరోయిన్స్ గా, కొత్త హీరోలతో సినిమాకి నిర్మాతలు కావాలి

  2. “సింగల్ సింహం” ఏ సింహం వీర్యంతో పుట్టిందో, ఎలా పుట్టిందో ఒక historical మూవీ “సింగల్ సింహానికి ‘డబల్ నామాలు” అనే ‘సైన్మా మావోడు తీస్తున్నాడు.. లండన్ లాపకీలు హీరోయిన్స్ గా, సంపూర్ణష్, మంచు హీరోలతో సినిమాకి సహ-నిర్మాతలు కావాలి

    1. నిర్మాతలు ఉన్నారు…. ఎవరో కాదు… మనకు బాగా తెలిసిన వ్యక్తి…. అందులో ఒకడు…. ఎవరికో పుట్టిన సంతానాన్ని తన కొడుకుగా స్వీకరించి….. రెండో వాడు… పెళ్ళాని ఎవడో సుఖపెడుతున్నాడని.. ఈర్ష్య చెందే వాడు…..

  3. ఇచ్చేవాడు ఉంటే తీసుకొనే వాడికి ఏముంది చెప్పండి. అయినా అంత పిచ్చోళ్ళు ఎవ్వరు లేరు. నల్లడబ్బు ని మార్చుకోవటమో లేకపోతె ఇంకేదో తెలియని బ్రహ్మ రహస్యాలు ఉంటయ్యి.

  4. Nivu pina cheppina hero lo Oka Gopi Chandu ki tappa migatavallaki action kuda raadu..

    atleast Gopi Chand movies ni mass people chusthaaru.. migatavallavi just waste

  5. ఒకప్పుడు సినిమా మాత్రమే వినోదం. దానికి మించి, ఖర్చు లేనివి అనేక వినోదసాధనాలు వచ్చాయి.

    గతంలో మాదిరిగా ఇప్పుడు సెలవులు అంటే సినిమా మాత్రమే కాదు.సెలవులు దొరికితే వేరే పనులు చక్క బెట్టుకోవడం, ప్రయాణాలు పెరిగాయి. సినిమాలు వెనుక పడ్డాయి.

  6. సినిమాను ప్రేక్షకుడు చూసే తీరు మారింది. మంచి సినిమా, చెడ్డ సినిమా అన్నది కాదు ఇప్పుడు కాన్సెప్ట్. ఓటీటీ సినిమా, థియేటర్ సినిమా అన్నది క్లాసిఫికేషన్. వాళ్ల వాళ్ల సోర్స్ ల్లో కన్ ఫర్మ్ చేసుకున్నాకే చూడడమా? మానడమా అన్నది వుంటోంది.

  7. Mari ala tappudi producers cinemalu yenduku teyadam. Yekkada nunchi america vellu akkada dabbulu sampadinchi aa vachina dabbulani cinemallo yenduku pettadam. Ippudunna heroes lo okadiki kuda talent alanti actors ki kotlu remuneration ichi shooting time lo comfort ichindi. Abroad lo shooting itey vallaki flight tickets book CHESI. Anta kastapadi cinema release cheste kanisam 10crores share kuda ravatle. Okavela luck bagundi hit itey mallu Andulo vache profits lo kuda share tesukuntaru inka producers ki am migaladu. So better producers investment movies lo pettadam apeyali

Comments are closed.