ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు

చంద్రకిరణ్ పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయశాంతి.

ఎమ్మెల్సీ విజయశాంతి, ఆమె భర్తపై బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తనకు డబ్బులు చెల్లించకపోతే నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయశాంతి.

కొన్నాళ్ల కిందట విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ కు పరిచయమయ్యాడు చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి. తను సోషల్ మీడియాలో పనిచేస్తానని, విజయశాంతికి మంచి మైలేజీ తెచ్చిపెడతానని నమ్మించాడు.

విజయశాంతి బీజేపీలో ఉన్నప్పుడు ఆమెకు చెందిన ఓ సోషల్ మీడియా పేజీని నిర్వహించారు చంద్రకిరణ్. అయితే విజయశాంతి ఇప్పుడు బీజేపీలో లేరు, కాంగ్రెస్ లోకి వచ్చి ఏకంగా ఎమ్మెల్సీ అయ్యారు.

ఈ క్రమంలో చంద్రకిరణ్ రెడ్డిని తప్పించారు. తనకు డబ్బులివ్వాలని చంద్రకిరణ్ కోరాడు. ఎప్పటికీ శ్రీనివాస ప్రసాద్ వైపు నుంచి సమాధానం రాకపోవడంతో, చంద్రకిరణ్ సహనం కోల్పోయారు. తనకు డబ్బులు చెల్లించకపోతే నరకం చూపిస్తానంటూ మెసేజీలు పంపించారు.

దీంతో చంద్రకిరణ్ పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయశాంతి. చంద్రకిరణ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని అందులో ఆమె ఆరోపించారు.

2 Replies to “ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు”

Comments are closed.