మొక్కల పెంపకంతో ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించొచ్చని, అందుకోసం జీవితాన్ని త్యాగం చేసిన వనజీవి, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత రామయ్య (85) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో శనివారం ఉదయం ఆయన లోకాన్ని శాశ్వతంగా విడిచివెళ్లారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో రామయ్య జన్మించారు.
గ్రామీణ ప్రాంతంలో జన్మించిన రామయ్యకు బాల్యం నుంచి మొక్కల పెంపకంపై ఆసక్తి. ఆయనకు తగ్గట్టుగానే భార్య జానకమ్మ కూడా తోడయ్యారు. దంపతులిద్దరూ కోటి మొక్కలకు పైగా నాటారు. వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ప్రతి మనిషీ జీవితంలో మొక్కలు నాటాలనే స్ఫూర్తిదాయక జీవితాన్ని ఆయన గడిపారు.
రామయ్య తన మనవళ్లు, మనవరాళ్లకు కూడా మొక్కల పేర్లే పెట్టడం విశేషం. 2018లో రామయ్య సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఢిల్లీలో అవార్డును స్వీకరించారు. ఇక చిన్నా, పెద్దా అవార్డులకు కొదవేలేదు.
ఇవాళ తెల్లవారుజామున ఇంట్లో స్పృహ లేకుండా పడి ఉన్న రామయ్యను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన్ను చివరిసారి చూడడానికి ప్రకృతి ప్రియులు తరలి వెళుతున్నారు.
Great Person…
Rest in peace
జాయిన్ కావాలి అంటే
Sadgati Praptirastu…
Join kavali ante proflie open