పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్‌ను సెకండ్ ఇన్నింగ్స్‌గానే పరిగణిస్తారు. మిస్‌గా ఉన్నప్పుడు రాణించినంతగా, మిసెస్‌గా సక్సెస్ సాధించలేరనే టాక్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. అయితే ఇవేవీ నిజం కాదని స్టార్ హీరోయిన్ సమంత తదితరులు నిరూపించారు.
ఇదిలా ఉండగా ముస్తపారాజ్‌ని హీరోయిన్ ప్రియమణి పెళ్లి చేసుకున్న తర్వాత వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి చిత్రంతో ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
ఇదే కాకుండా ప్రస్తుతం ఆమె విరాటపర్వం సినిమాలో భారతక్క, నారప్ప సినిమాలో విక్టర్ వెంకటేష్ సరసన డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే ….కథ డిమాండ్ చేస్తే మాత్రం అందాల ఆరబోతకు తాను రెడీ అని ప్రియమణి ప్రకటించారు. అంతటితో ఆమె ఆగలేదు.
కొన్ని గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారు మతి పోగొడుతున్నారు. ప్రియమణి గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంటే …ఆమె ఎంతగా కవ్విస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.