ఎస్కేఎల్ఎస్ గేలాక్సీ మాల్ ప్రొడక్షన్స్ పతాకంపై బృంద రవిందర్ దర్శకత్వంలో ఈ. మోహన్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే..నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రానికి `బ్లాక్ n వైట్` టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను త్వరలోనే విడుదలచేయనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బృంద రవిందర్ మాట్లాడుతూ – “న్యూ ఇయర్ రోజున మా మూవీ టైటిల్ `బ్లాక్ n వైట్` టైటిల్ ను అనౌన్స్ చేయడం హ్యాపీగా ఉంది. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో కలర్ ఫుల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ ని విడుదల చేస్తాం“అన్నారు.
నిర్మాత మోహన్ మాట్లాడుతూ – “బ్లాక్ n వైట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఆడియన్స్‌ని తప్పకుండా థ్రిల్ చేస్తుంది“అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడిమిట్ల శివ ప్రసాద్ – ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే నటీనటుల వివరాలు ప్రకటిస్తాం“ అన్నారు.