కలర్ ఫుల్ గా `బ్లాక్ n వైట్`

ఎస్కేఎల్ఎస్ గేలాక్సీ మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై బృంద ర‌వింద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ. మోహ‌న్ నిర్మాత‌గా ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే..నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా  ఈ చిత్రానికి  `బ్లాక్ n వైట్` టైటిల్‌ను అధికారికంగా…

ఎస్కేఎల్ఎస్ గేలాక్సీ మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై బృంద ర‌వింద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ. మోహ‌న్ నిర్మాత‌గా ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే..నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా  ఈ చిత్రానికి  `బ్లాక్ n వైట్` టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ  వీడియోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. 

ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల‌చేయ‌నున్నారు.  మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు బృంద ర‌వింద‌ర్ మాట్లాడుతూ  –  “న్యూ ఇయ‌ర్ రోజున మా మూవీ టైటిల్ `బ్లాక్ n వైట్` టైటిల్ ను అనౌన్స్ చేయ‌డం హ్యాపీగా  ఉంది. ఒక డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో కలర్ ఫుల్ గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ ని విడుద‌ల చేస్తాం“అన్నారు.

నిర్మాత   మోహ‌న్ మాట్లాడుతూ – “బ్లాక్ n వైట్ అనే  ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఆడియ‌న్స్‌ని త‌ప్ప‌కుండా థ్రిల్ చేస్తుంది“అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గుడిమిట్ల శివ ప్ర‌సాద్ – ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. త్వ‌ర‌లోనే న‌టీన‌టుల వివ‌రాలు ప్ర‌క‌టిస్తాం“ అన్నారు. 

చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం