జూమ్ కు దగ్గరగా.. భూమికి దూరంగా.. జగన్ పంచ్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఎప్పుడైనా విమర్శించాల్సి వస్తే మాత్రం ఆ పంచ్ చాలా గట్టిగా ఉంటుంది. అందులో ఎంతో సెటైర్ దాగి ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఎప్పుడైనా విమర్శించాల్సి వస్తే మాత్రం ఆ పంచ్ చాలా గట్టిగా ఉంటుంది. అందులో ఎంతో సెటైర్ దాగి ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత జగన్ మరోసారి చంద్రబాబుపై పంచ్ వేశారు.

“రైతుభరోసా, ఇన్-పుట్ సబ్సిడీ ఇస్తామని ఇది వరకే చెప్పాం. ఒకసారి కాదు, 6సార్లు చెప్పాం. తేదీ కూడా చెప్పాం. ఇవన్నీ తెలిసి కూడా ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోంది. 

జగన్ మాట ఇస్తే జరుగుతుంది, చెప్పిన తేదీకి ఇన్-పుట్ సబ్సిడీ పడుతుంది. ఇది ఎలాగూ జరుగుతుందని తెలుసు కాబట్టి వెంటనే చంద్రబాబు జూమ్ నొక్కుతాడు. జూమ్ కు దగ్గరగా, భూమికి దూరంగా ఉండే నాయుడు గారు ఆయన.”,

ఈసారి చంద్రబాబుతో పాటు లోకేష్-పవన్ కల్యాణ్ పై కూడా పంచ్ లు వేశారు ముఖ్యమంత్రి. వాళ్లు పేర్లు ఉచ్ఛరించకుండా.. ఇద్దరికీ జాయింట్ గా చురకలు అంటించారు. లోకేష్-పవన్ ను జూమ్ నాయుడుకు దత్తపుత్రులుగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి.

“జూమ్ నాయుడు తన పుత్రుడ్ని, తన దత్తపుత్రుడ్ని (పవన్) ఇద్దర్నీ రంగంలోకి దించుతాడు. ఒక్కరిపై అతడికి నమ్మకం లేదు కాబట్టి ఇద్దర్నీ ఒకేసారి దించుతాడు. 

మనం ఇన్-పుట్ సబ్సిడీ ఇస్తున్నామని తెలిసి, సరిగ్గా ఒకరోజు ముందు హైదరాబాద్ నుంచి వీళ్లంతా దిగుతారు. వీళ్లిద్దరికీ (పవన్-లోకేష్) రైతుల మీద ప్రేమ లేదు. రైతుల కష్టాలు వీళ్లకు పట్టవు. గత ప్రభుత్వం రైతులు అష్టకష్టాలు పడుతుంటే కనీసం నోరుమెదపని పుత్రులు వీళ్లిద్దరూ.”

ఇలా చాన్నాళ్ల తర్వాత బాబు-లోకేష్-పవన్ త్రయాన్ని తన పంచ్ లతో ఆడుకున్నారు జగన్. రైతుభరోసా మూడో విడత నిధులు, నివర్ తుపానులో దెబ్బతిన్న రైతులకు ఇన్-పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) ఈరోజు ఇస్తామని గతంలోనే ప్రకటించిన ముఖ్యమంత్రి.. చెప్పినట్టుగానే లబ్దిదారుల ఖాతాల్లోకి అక్షరాలా 1766 కోట్ల రూపాయలు జమచేశారు.