బ్రహ్మాండంగా మెరిసిన బలగం

ఏమాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. తెలంగాణ పల్లెల్లో పరదాలు కట్టి మరీ ఈ  సినిమాను చూశాను. సినిమా చూసిన తర్వాత విడిపోయిన కొన్ని కుటుంబాలు…

ఏమాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. తెలంగాణ పల్లెల్లో పరదాలు కట్టి మరీ ఈ  సినిమాను చూశాను. సినిమా చూసిన తర్వాత విడిపోయిన కొన్ని కుటుంబాలు కలిసినట్టు కూడా వార్తలొచ్చాయి. అలా సెన్సేషనల్ హిట్టయిన ఈ సినిమా, తాజాగా బుల్లితెరపైకొచ్చింది.

టీవీల్లో కూడా ఈ సినిమా ఊహించని విజయాన్నందుకుంది. స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేసిన బలగం సినిమాకు ఏకంగా 14.3 టీఆర్పీ వచ్చింది. రీసెంట్ టైమ్స్ లో స్మాల్ స్క్రీన్ లో ప్రసారమైన సినిమాల్లో ఇదే అత్యథికం. హైదరాబాద్ సెగ్మెంట్ లోనైతే ఏకంగా 22 రేటింగ్ తో సంచలనం సృష్టించింది బలగం మూవీ.

ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలకే డబుల్ డిజిట్ రావడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా సిల్వర్ స్క్రీన్ కు పూర్తి భిన్నంగా, స్మాల్ స్క్రీన్ పై ఏ సినిమా సక్సెస్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్న టైమ్ ఇది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టీవీల్లోకి వచ్చిన బలగం సినిమా సెన్సేషనల్ టీఆర్పీ సాధించింది.

ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు హాస్యనటుడు వేణు దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా అతడికిదే తొలి సినిమా. మొత్తమ్మీద.. వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సూపర్ హిట్ అనిపించుకుంది బలగం.