మూడు రాజధానులకు మద్దతుగా జగన్ కి పాలాభిషేకం

అమరావతే ఏకైక రాజధాని అని తెలుగుదేశం గొంతు చించుకున్నపుడు ఇతర ప్రాంతాల వారు ఎవరూ కంటికి కనిపించలేదు. నిజానికి ఏ ముఖ్యమంత్రికీ లేని రాని  అవకాశం చంద్రబాబుకు దక్కింది. 14 ఏళ్ళ పాటు ఆయన…

అమరావతే ఏకైక రాజధాని అని తెలుగుదేశం గొంతు చించుకున్నపుడు ఇతర ప్రాంతాల వారు ఎవరూ కంటికి కనిపించలేదు. నిజానికి ఏ ముఖ్యమంత్రికీ లేని రాని  అవకాశం చంద్రబాబుకు దక్కింది. 14 ఏళ్ళ పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అందులో తొమ్మిదేళ్ళు 23 జిల్లాల ఉమ్మడి ఏపీకి పనిచేశారు.

మరి బాబు రాజకీయ నేత నుంచి రాజకీయ కోవిదుడుగా మారాల్సిన సందర్భం ఇదే. అన్ని ప్రాంతాలూ తనకు సమానమే, అంతటా అభివృద్ధి కావాలని ఆయన అనుభవం చూసినా వయసు చూసినా కూడా మనస్పూర్తిగా  కోరుకోవాలి. కానీ అమరావతే ఏకైక రాజధాని అంటూ అదే పట్టుదలతో ముందుకు పోతున్నారు.

మరి అత్యంత వెనకబడిన రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ బాబు తలవకపోవడం విడ్డూరమే. మొత్తానికి అమరావతే నాకు ముద్దు అంటూ బాబు ఈ ప్రాంతాలను వాటి మానాన  వదిలేశారనే అనుకోవాలి.

ఇదిలా ఉంటే మూడు రాజధానుల ప్రకటన చేసి ఏడాది అయిన సందర్భంగా విశాఖ జిల్లా నర్శీపట్నంలో వైసీపీ ఒక కార్యక్రమం నిర్వహించి జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ మాట్లాడుతూ హైదరాబాద్ రాజధాని  మోడల్ వల్ల ఏపీ  భారీ ఎత్తున నష్టపోయిందని అన్నారు.

కుప్పపోసినట్లుగా ఒకే చోట అభివృద్ధి చేస్తే మిగిలిన ప్రాంతాలు తీరని అన్యాయానికి గురి అవుతారని ఆయన పేర్కొనారు. జగన్ అందుకే ముందు చూపుతో చేసిన ఆలోచన మూడు రాజధానులు అన్నారు.

తొందరలోనే విశాఖకు పాలనారాజధాని తరలిరావడం ఖాయమని కూడా ఆయన పక్కా  క్లారిటీగా చెప్పేశారు. మొత్తానికి బాబు మరచిన ప్రాంతాలు, వదలిన ప్రాంతాల విషయంలో తమ్ముళ్ళు ఇపుడు  ఏం సమాధానం చెబుతారో.

ఫెయిల్యూర్ సినిమా…ప్ర‌మోష‌న్ ఎపిసోడ్