నిర్మాత దిల్ రాజు యాభయ్యవ బర్త్ డే సందర్భంగా భారీ ఎత్తున పార్టీ ఇచ్చిన సంగతి, ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలు పలువురు హాజరయిన సంగతి తెలిసిందే. అయితే ఈకార్యక్రమం రాత్రి పన్నెండు గంటలు దాటిన తరువాత మరింత ఊపందుకుందని బోగట్టా.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన అలవాటు ప్రకారం విపరీతంగా సెటైరికల్ జోకులు పేల్చినట్లు తెలుస్తోంది. చుట్టూ వున్న జనాలు ఆ సెటైర్లకు పడి పడి నవ్వినట్లు తెలుస్తోంది.
దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి సదా మహేష్ వెంటే వుండి ఆయన జోక్ లను ఆస్వాదించినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే అదే టైమ్ లో నిర్మాత దిల్ రాజు తన డ్యాన్స్ ప్రతిభను కూడా చూపించినట్లు తెలుస్తోంది. పలు పాటల ట్యూన్ లకు ఆయన డ్యాన్స్ లు చేసి గెస్ట్ లను ఆకట్టకుుంటున్నట్లు తెలుస్తోంది.
ఆ డైరక్టర్ రాలేదు
కొన్నాళ్ల క్రితం దిల్ రాజు భాగస్వామి, బంధువు శిరీష్ ఇలాగే భారీ ఇచ్చారు. ఆ పార్టీలో ఓ డైరక్టర్ కాస్త ఎక్కువ మాట్లాడి, సెటైర్లు వేసి హల్ చల్ చేసారని అప్పట్లో గ్యాసిప్ లు వినిపించాయి. ఆ టైమ్ లో ఆయన మహేష్ ఆగ్రహానికి గురయ్యారని కూడా గ్యాసిప్ లు వినిపించాయి.
దిల్ రాజుతో మంచి సంబంధాలు వుండి, ఇలాంటి పార్టీలకు పక్కాగా హారజయ్యే ఆ దర్శకుడు ఈసారి డుమ్మా కొట్టేసినట్లు తెలుస్తోంది. ఆ డైరక్టర్ సన్నిహిత స్నేహితులు ఒకరిద్దరు మాత్రం ఈ పార్టీకి హాజరుకావడం విశేషం.
యువి హాజరు లేదు
దిల్ రాజుతో వ్యాపార బంధాలు వున్న యువి సంస్థ వంశీ కానీ, విక్కీ కానీ పంక్షన్ కు రాలేదు. కానీ వారి సన్నిహితులు హీరో ప్రభాస్, ఆయన సోదరుడు ప్రమోద్ హాజరయ్యారు. అలాగే దిగ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాప్ డైరక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఈ ఫంక్షన్ కు రాలేదు.
సంగీత దర్శకుడు దేవీశ్రీ ఫ్రసాద్ చెన్నయ్ నుంచి ప్రత్యేకంగా ఈ పార్టీకి రాగా, థమన్ జాడ మాత్రం కనిపించలేదు. అల్లు అరవింద్ ఇదే రోజు ఎఫ్ 3 ఓపెనింగ్ కు వచ్చారు. బహుశా అందుకే రాలేదేమో?
ప్రత్యేక ఆకర్షణ
జనవరి 9న పెళ్లి చేసుకోబోయే కొత్త జంట గాయని సునీత, డిజిటల్ బిజినెస్ మన్ మ్యాంగో రామ్ ఈ ఫంక్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలువురికి సునీతను రామ్ పరిచయం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద దిల్ రాజు 50 వ బర్త్ డే పార్టీ ధూమ్ ధామ్ గా జరిగి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.