‘థ్రిల్లర్ హరి’ గా డర్టీ హరి

సీనియర్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు దర్శకత్వంలో నిర్మించిన సినిమా డర్టీ హరి. ఈ సినిమా కొత్త ఎటిటి ఎఫ్ ఎమ్ (ఫ్రెండ్లీ మూవీస్) లో 18న విడుదల కాబోతోంది. Advertisement ఇప్పటి వరకు…

సీనియర్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు దర్శకత్వంలో నిర్మించిన సినిమా డర్టీ హరి. ఈ సినిమా కొత్త ఎటిటి ఎఫ్ ఎమ్ (ఫ్రెండ్లీ మూవీస్) లో 18న విడుదల కాబోతోంది.

ఇప్పటి వరకు ఓ ఎరోటిక్ మూవీగా పబ్లిసిటీ కంటెంట్ వదులుతూ వస్తున్నారు. ఈ రోజు కొత్త ట్రయిలర్ ను వదిలారు. ఈ ట్రయిలర్ మొత్తం ఓ థ్రిల్లర్ సినిమాగా డర్టీ హరిని ప్రొజెక్ట్ చేస్తోంది.

సినిమా స్టార్టింగ్ ఓ ఇంగ్లీష్ డైలాగ్, చివర్లో బాత్ టబ్ లో హీరోయిన్ కు హీరో వీపు తోమే సీన్ తప్ప ట్రయిలర్ మొత్తం ఇంట్రస్టింగ్ ఇన్ వెస్టిగెటింగ్ థ్రిల్లర్ గా కట్  చేసారు. 

అలా అని చకచకా షాట్ మీద షాట్ వేస్తూ హడావుడి చేయకుండా, నిదానంగా సీన్లు వేసుకుంటూ, స్మూత్ గా బ్యాక్  గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసుకుంటూ వెళ్లారు. మొత్తం మీద ఓ ప్రామిసింగ్ ట్రయిలర్ ను కట్ చేసి వదిలారు డర్టీ హరి కోసం.