ఫ్లాష్ న్యూస్..ఎఫ్ 3 వితవుట్ రవితేజ?

ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో తనకు తిరుగులేదు అనిపించుకుంటున్న డైరక్టర్ అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు హిట్ తరువాత ఆయన ఏం చేస్తారు అన్నది ఆసక్తికరం. ఎఫ్ 2 బాలీవుడ్…

ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో తనకు తిరుగులేదు అనిపించుకుంటున్న డైరక్టర్ అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు హిట్ తరువాత ఆయన ఏం చేస్తారు అన్నది ఆసక్తికరం. ఎఫ్ 2 బాలీవుడ్ రీమేక్ కు వెళ్తారా? ఎఫ్ 3 చేస్తారా? అన్నది క్వశ్చను. వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి ఎఫ్ 3 నే చేయబోతున్నారు. నిర్మాత దిల్ రాజు నే అందులో సందేహం లేదు.

అయితే ఎఫ్ 3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, రవితేజ ముగ్గురూ, హీరోలుగా వుంటారని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఈ సినిమాలో రవితేజ వుండడు అని తెలుస్తోంది. ఇటీవల రవితేజ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి. ఆయన అస్సలు క్రౌడ్ ను పుల్ చేయలేకపోతున్నారు. ఎంత బజ్ వచ్చినా డిస్కోరాజాకు మంచి ఓపెనింగ్స్ కూడా రాలేదు.

అందువల్ల రవితేజను యాడ్ చేస్తే సినిమాకు అంత బిజినెస్ వుండదని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. మరో హీరోను ఎవరినైనా జోడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఫిక్స్ కాలేదు. స్క్రిప్ట్ చూసి, ఎవరు నప్పుతారో ఆ హీరోను తీసుకువచ్చిు ఎఫ్ 2 జోడీకి మూడో హీరోగా యాడ్ చేయాలని ప్రయత్నం అయితే వుంది. 

దిల్ రాజు-అనిల్ రావిపూడి మనసులో వున్న ఆ మూడో హీరో ఎవరు అన్నది సస్సెన్స్ గానే వుంది. అది సినిమా స్క్రిప్ట్ పూర్తయి, ఆ హీరో ఓకె అన్న తరువాతే రివీల్ చేస్తారు. ఎప్పుడు రివీల్ చేసినా, ఈ మూడు హీరోల కాంబినేషన్ మాత్రం సూపర్ గా వుంటుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికే