పవన్ క్యారెక్టరే మారిపోయింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేసారు. ఆయన ఎంత దాచాలనుకున్నా అది దాగదు. ఎటొచ్చీ ఫొటోలు బయటకు రాకుండా చేయగలరు. చేస్తున్నారు. నెట్ లో ఫొటోలు కనిపిస్తే చాలు, యూనిట్ చేత డిలీట్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేసారు. ఆయన ఎంత దాచాలనుకున్నా అది దాగదు. ఎటొచ్చీ ఫొటోలు బయటకు రాకుండా చేయగలరు. చేస్తున్నారు. నెట్ లో ఫొటోలు కనిపిస్తే చాలు, యూనిట్ చేత డిలీట్ చేయించి, బ్లాక్ చేయిస్తున్నారు. సరే, ఎన్నాళ్లు దాగుతుంది. సినిమాలు విడుదల కావాలి కదా? 

ఆ సంగతి అలా వుంచితే పింక్ సినిమాను రీమేక్ చేస్తూ, పవన్ మళ్లీ సినిమాల్లోకి రావడం అన్నది ఆయన ఫ్యాన్స్ కు అంతగా ఇష్టం లేదు. ఇది వాస్తవం. మాంచి జోష్ తో వున్న సినిమా అయితే బెటర్ అని ఫ్యాన్స్ ఫీలింగ్. ఆ సంగతి పింక్ రీమేక్ మేకర్లకు కూడా తెలుసు. అందుకే పింక్ తెలుగు వెర్షన్ లో పవన్ క్యారెక్టర్ లో మార్పులు చేర్పులు చేసినట్లు బోగట్టా. 

పింక్ సినిమాలో హీరో అజిత్ క్యారెక్టర్ కాస్త డల్ నోట్ తో వుంటుంది. కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ కాస్త ఆరోగెన్సీతో వుంటుంది. పవన్ ను ఆరోగెన్సీ యాటిట్యూడ్ తో చూపించి, తద్వారా హీరోయిజం ఎలివేట్ చేయబోతున్నారు. అందువల్ల పింక్ రీమేక్ పట్ల పవన్ అభిమానులు భరోసాగా వుండొచ్చు.

నేను అనుకున్నదానికంటే బాగా చేశాడు మా అబ్బాయి