దర్శకుడు త్రివిక్రమ్ పేరును పోలిన అక్కౌంట్ తో ఎవరో ట్వీట్ చేసారు. మంత్రి పేర్ని నాని అది త్రివిక్రమ్ అక్కౌంట్ నే అనుకున్నారు. త్రివిక్రమ్ చెప్పిన దాన్ని సిఎమ్ దృష్టికి తీసుకెళ్లా అని కూడా చెప్పేసారు. కానీ విషయం ఏమిటంటే త్రివిక్రమ్ అలాంటి కామెంట్ లు ఏవీ చేయలేదని ఆయన తర- నుంచి క్లారిఫికేషన్ వచ్చేసింది.
కానీ ఆ సంగతి ఎలా వున్నా, అలా చెప్పారంటున్న పాయింట్లు కాస్త వాలిడ్ గానే వున్నాయి. జనాలకు స్కూళ్లు, ఆసుపత్రులు కీలకం కదా, మరి అన్ని రకాల ఆసుపత్రులకు, స్కూళ్లకు ఒకటే తరహా ఫీజులు వుండేలా చూస్తారా? సినిమా కన్నా అవి కీలకం కదా అన్నది ఆ ట్వీట్ లో పాయింట్.
నిజానికి ఇలాంటి చాలా పాయింట్లు ఈ మధ్యన వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం కంట్రోల్ చేయాలని అనుకున్నప్పటి నుంచి ఇలాంటివి వినిపిస్తున్నాయి.
లిక్కర్ రేట్లు ఇష్టం వచ్చినట్లు ఫిక్స్ చేయచ్చు. ఆసుపత్రులు దోచేసుకోవచ్చు, స్కూళ్లు ఫీజులు బాదేయవచ్చు. ఎవరి ప్రొడక్ట్ కు వారే రేట్ల పెట్టుకోవచ్చు కానీ సినిమా దగ్గరకు వచ్చేసరికి నియంత్రణా అంటూ వాదనలు వినిపిస్తున్నాయి.
వీటిపైనే మంత్రి స్పందించారు. ఎవరు ఏం చెప్పినా అన్నీ సిఎమ్ దృష్టికి తీసుకెళ్లడం మాత్రమే తన పని, తన లిమిటేషన్లు తాను చెప్పేసారు. మంత్రిగా ఆయన చేయగలిగింది అంతే పాపం.