ముద్దు సీన్ కు ఆ హీరో సిగ్గుప‌డ్డాడ‌న్న కాజ‌ల్!

ఈ రోజుల్లో సినిమాల్లో లిప్ లాక్ సీన్లు చాలా స‌హ‌జం అయిపోయాయి. దాదాపు గ‌త ద‌శాబ్ద‌కాలం నుంచి తెలుగు సినిమాల్లో కూడా అలాంటి సీన్లు కామ‌న్ అయ్యాయి. బాలీవుడ్ సంగ‌తైతే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉత్త‌రాది నుంచి…

ఈ రోజుల్లో సినిమాల్లో లిప్ లాక్ సీన్లు చాలా స‌హ‌జం అయిపోయాయి. దాదాపు గ‌త ద‌శాబ్ద‌కాలం నుంచి తెలుగు సినిమాల్లో కూడా అలాంటి సీన్లు కామ‌న్ అయ్యాయి. బాలీవుడ్ సంగ‌తైతే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉత్త‌రాది నుంచి వ‌చ్చే హీరోయిన్లు సౌత్ సినిమాల్లో అందుకు సై అంటూ ఉంటారు. అలాంటి వారిలో ఒక‌రు కాజ‌ల్ అగ‌ర్వాల్.

తొలి తొలి సినిమాల నుంచినే గ్లామ‌ర్ ను పండిస్తూ టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోల‌తో న‌టించింది కాజ‌ల్. ఈమె తెర‌పై అందించిన అందాల విందు గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ క్ర‌మంలో లిప్ లాక్ స‌న్నివేశాల్లో కూడా కాజ‌ల్ న‌టించింది. అయితే ఒక సినిమా విష‌యంలో మాత్రం హీరో చాలా సిగ్గుప‌డ‌టంతో ఒక లిప్ లాక్ సీన్ లో న‌టించ‌కుండానే దాన్ని చిత్రీక‌రించిన‌ట్టుగా కాజ‌ల్ చెప్పింది.

సూర్య హీరోగా న‌టించిన బ్ర‌ద‌ర్స్ సినిమా విష‌యంలో అది జ‌రిగింద‌ని కాజల్ అంటోంది. ఆ సినిమాలో త‌న‌, సూర్య లిప్ లాక్ సీన్ ఉంటుంద‌ని.. అది నిజంగా చేసింది కాద‌ని అంటోంది కాజ‌ల్. ఆ స‌న్నివేశంలో న‌టించ‌డానికి సూర్య చాలా సిగ్గుప‌డ్డాడ‌ని.. దీంతో ద‌ర్శ‌కుడు కేవీ ఆనంద్ వేర్వేరు ఫ్రేమింగ్స్ తో ఆ సీన్ ను చిత్రీక‌రించి, ఒకే సీన్ గా చూపించాడ‌ని కాజల్ ఆ ముద్దు సీన్ వెనుక విష‌యాన్ని వివ‌రించింది.

బాలీవుడ్ లో ర‌ణ్ దీప్ హుడాతో కూడా కాజ‌ల్ ఇదే త‌ర‌హాలో ఒక సీన్ చేసింది. ముందుగా ఒక బెలూన్ కు వీరితో ముద్దు పెట్టించి, దాన్ని వారిద్ద‌రూ పెట్టుకున్న ముద్దుగా చూపించారు ఆ సినిమాలో. ఆ సీన్ చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది. మొత్తానికి ముద్దు సీన్ల‌ను ఇలా చిత్రీక‌రించే సౌల‌భ్యం ఉండ‌నే ఉన్న‌ట్టుంది. అయితే స‌హ‌జత్వం కోసం కొంత‌మంది .. నిజంగానే ముద్దులు పెట్టిస్తున్నారు.

ప్రస్తుతం ఒక ట్రాప్ లో ఉన్నాను

యధా మోడీ..తథా పవన్