పదవి పోతున్న వేళ నోరు విప్పిన కళా?

మాజీ మంత్రి, ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకటరావు జగన్ ప్రభుత్వం మీద గట్టిగా నోరు చేసుకున్నారు. ఏపీలో పేదల ఇళ్ళ స్థలాల విషయంలో అవినీతి జరిగిందని గర్జించారు. సిట్టింగ్ జడ్జిని నియమిస్తే ఆధారలతో…

మాజీ మంత్రి, ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకటరావు జగన్ ప్రభుత్వం మీద గట్టిగా నోరు చేసుకున్నారు. ఏపీలో పేదల ఇళ్ళ స్థలాల విషయంలో అవినీతి జరిగిందని గర్జించారు. సిట్టింగ్ జడ్జిని నియమిస్తే ఆధారలతో సహా నిరూపిస్తామని అంటున్నారు.

ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కళా ఒక్కసారిగా జగన్ మీద బాణాలు వేయడం వెనక రాజకీయమే ఉందని అంటున్నారు. మరో వైపు తన ప్రెసిడెంట్ గిరీ కుర్చీ కిందకు నీళ్ళు రావడంతోనే కళా నేనున్నాను అంటున్నారట. అయితే గత ఏడాది ఎన్నికల్ల్లో దారుణంగా ఓడిపోయిన కళా వెంకటరావు ఈ ఏడాది స్థానిక ఎన్నికలు జరగడానికి ముందే తన సొంత నియోజకవర్గంలో జెండా ఎత్తేశారు. అక్కడ  అన్ని సీట్లూ వైసీపీకి ఏకగ్రీవమైపోయాయి.

అది పెద్ద మైనస్ అయితే ఆయన ప్రెస్ నోట్లు, లేఖల ప్రెసిడెంట్ గా ఉన్నారు తప్ప పెద్దగా జోరు చేయలేదని ఒక కామెంట్ ఉందిట. మరి గల్లీ స్థాయి రాజకీయానికి కూడా అధినేత సిధ్ధపడిపోతే తానుండి ఎందుకు అన్నది కళా వారి వాదనగా ఆవేదనగా ఉందిట‌. ఏది ఏమైనా ఉత్తరాంధ్రాలో పాలనరాజధానికి జగన్ డిసైడ్ చేసిన వేళ అటు పార్టీ వాణిని బలంగా వినిపించలేక, ఇటు జనం మాటకు హై కమాండ్ కి చెప్పలేక కళా చాలానే ఇరకాటంలో పడ్డారనీ అంటున్నారు.

ఇపుడు ఆ బాధ తప్పినా చెప్పుకోవడానికి ఆ ఒక్క పదవీ లేకుండా పోవడమే వెలితిగా ఉందిట. అంతకు మించి ఆరో  వేలు లాంటి ఆ పదవితో చేసేది ఏమీలేదని కూడా అంటున్నారు. ఏది ఏమైనా కళా స్వేచ్చా జీవి అయ్యారా, లేక రాజకీయ బలి అయ్యారా అన్నదే టీడీపీలో పెద్ద  చర్చట.

వీడు అక్కయ్య వాడు అన్నయ్య

భగవద్గీత వల్లిస్తే చాలదు.. బాణం పట్టాలి