దేవరకొండ ట్రిక్కులు పని చేస్తాయా?

విజయ్‌ దేవరకొండ న్యూ ఏజ్‌ మార్కెటింగ్‌ని బాగా నమ్ముతుంటాడు. విజయవంతమైన తన చిత్రాలకి మంచి వసూళ్లు రావడంలో విజయ్‌ మార్కెటింగ్‌ కూడా దోహదపడింది. అలాగే ఫ్లాప్‌ అయిన నోటా, డియర్‌ కామ్రేడ్‌ లాంటి చిత్రాలకి…

విజయ్‌ దేవరకొండ న్యూ ఏజ్‌ మార్కెటింగ్‌ని బాగా నమ్ముతుంటాడు. విజయవంతమైన తన చిత్రాలకి మంచి వసూళ్లు రావడంలో విజయ్‌ మార్కెటింగ్‌ కూడా దోహదపడింది. అలాగే ఫ్లాప్‌ అయిన నోటా, డియర్‌ కామ్రేడ్‌ లాంటి చిత్రాలకి కూడా తొలిరోజు ఘనమైన వసూళ్లు రాబట్టగలిగాడు. విచిత్రమైన స్టయిల్‌తో, ఫ్యాషన్‌ సెన్స్‌తో మందిలోంచి వేరుగా కనిపించే విజయ్‌ దేవరకొండ తన తొలి నిర్మాణం అయిన 'మీకు మాత్రమే చెప్తా'కి కూడా చిత్రమైన మార్కెటింగ్‌ చేస్తున్నాడు.

కాన్సెప్ట్‌ ప్రధానంగా రూపొందిన చిన్న చిత్రమయినా కానీ దీనికి విజయ్‌ ఇప్పటికి బజ్‌ అయితే తీసుకురాగలిగాడు. మరి ఈ చిత్రానికి ప్రేక్షకులు థియేటర్లకి కదిలి వస్తారా లేదా అనేది చూడాలి. చిన్న చిత్రం కనుక మంచి టాక్‌ వచ్చినట్టయితే ఖచ్చితంగా వీకెండ్‌కి వసూళ్లు బాగుంటాయి. వచ్చేవారం పెద్ద సినిమాలేవీ లేకపోవడం దీనికి కలిసివస్తుంది. ఈ చిత్రానికి వచ్చే స్పందనని బట్టి ఇకపై నిర్మాణం పట్ల ఎంత సీరియస్‌గా వుండాలనేది విజయ్‌ డిసైడ్‌ అవుతాడు.

తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండని హీరోగా నిలబెట్టడానికి ఈ నిర్మాణ సంస్థ ద్వారా ప్రయత్నాలయితే ముమ్మరం చేసాడు. ఇదిలావుంటే హీరోగా విజయ్‌ చేస్తోన్న 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రానికి ఇంతవరకు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేయలేదు. తగిన రిలీజ్‌ టైమ్‌ చూసుకుని వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేద్దామని చూస్తున్నారు. 

మెగా హీరోపై డైరెక్టర్ ఫన్నీ కామెంట్స్.. సరదా ఇంటర్వ్యూ