ఆ సినిమా విషయంలో దిల్‌ రాజు సైలెంట్‌

మార్కెటింగ్‌ పరంగా చాలా కేర్‌ తీసుకుని, ప్రతి సినిమాకీ మంచి రిలీజ్‌ ప్లాన్‌ చేసే దిల్‌ రాజు తన బ్యానర్‌లో రూపొందుతోన్న 96కి మాత్రం అసలు పబ్లిసిటీ కాదు కదా, కనీసం ప్రెస్‌నోట్‌ కూడా…

మార్కెటింగ్‌ పరంగా చాలా కేర్‌ తీసుకుని, ప్రతి సినిమాకీ మంచి రిలీజ్‌ ప్లాన్‌ చేసే దిల్‌ రాజు తన బ్యానర్‌లో రూపొందుతోన్న 96కి మాత్రం అసలు పబ్లిసిటీ కాదు కదా, కనీసం ప్రెస్‌నోట్‌ కూడా రిలీజ్‌ చేయడం లేదు. ఎంతో ఇష్టంగా తమిళ చిత్రం రీమేక్‌ రైట్స్‌ తీసుకుని, ఒరిజినల్‌ తీసిన దర్శకుడినే తీసుకొచ్చి, శర్వానంద్‌-సమంత కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు.

కొద్దిరోజుల క్రితం ఈ చిత్రం సెట్స్‌ నుంచి ఫోటో పెట్టిన సమంత వల్ల 96 అనేది ఒకటి నిర్మాణంలో వుందని జనం గుర్తు చేసుకున్నారు. దిల్‌ రాజు అసలు ప్లాన్‌ అయితే డిసెంబర్‌ 20 లేదా 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని. కానీ ఆ సమయంలో చాలా చిత్రాలు రిలీజ్‌ అవుతూ వుండడంతో 96 రిలీజ్‌పై కంగారు పడడంలేదు. మామూలుగా అయితే తాను తీసే చిన్న చిత్రాలని కూడా సంక్రాంతికి రిలీజ్‌ చేసేస్తుంటాడు.

అయితే ఈసారి సరిలేరు నీకెవ్వరు వుండడంతో 96కి సంక్రాంతి స్లాట్‌ దొరకలేదు. దిల్‌ రాజు ఇంత సైలెంట్‌గా వున్నాడంటే 96ని ఫిబ్రవరి మూడవ వారానికి లేదా వేసవికి విడుదల చేయాలని డిసైడ్‌ ఉన్నట్టున్నాడు. ఇటీవల రెండు ఫ్లాప్‌లతో శర్వానంద్‌ మార్కెట్‌ కూడా డౌన్‌ అయివుంది కనుక తగిన సమయం కోసం వేచిచూసి విడుదల చేయడం మంచి స్ట్రాటజీనే. 

మెగా హీరోపై డైరెక్టర్ ఫన్నీ కామెంట్స్.. సరదా ఇంటర్వ్యూ