వల్లభనేని.. ప్యాకప్ కు రెడీ చెబుతున్నారా?

తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ మోహన్ ఒక్కోసారి పార్టీకి అతివిధేయుడుగా ఉంటారు. అదే సమయంలో ఆయన పార్టీని వీడతారనే ఊహాగానాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వంశీ ఆ…

తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ మోహన్ ఒక్కోసారి పార్టీకి అతివిధేయుడుగా ఉంటారు. అదే సమయంలో ఆయన పార్టీని వీడతారనే ఊహాగానాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వంశీ ఆ పార్టీని వీడతారనే ప్రచారం జరిగింది. కొడాలి నాని తో పాటు అప్పట్లో ఈయన కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం సాగింది.

అయితే వంశీ తెలుగుదేశంలోనే మిగిలిపోయారు. కొడాలినాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఐదేళ్ల తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఆ సంగతలా ఉంటే.. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ తరఫున నెగ్గిన తక్కువమంది ఎమ్మెల్యేల్లో వంశీ ఒకరు. ఆయన ఆ పార్టీని వీడతారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన వెళ్లి బీజేపీ ఎంపీగా చలామణిలో ఉన్న సుజనా చౌదరిని కలిశారు. బహుశా వల్లభనేని బీజేపీ లోకి చేరాలని అనుకుంటున్నారా? అనే డౌట్స్ కు తెరలేపారు.

అయితే ఏపీ అసెంబ్లీలో ఫిరాయింపుదారులను ఎంటర్ టైన్ చేసేలా లేరు. ఫిరాయింపుదారులపై వేటు పడేఅవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తన నియోజకవర్గం పై తనకు అపారమైన పట్టుందని భావించే వల్లభనేని వంశీ మోహన్ బీజేపీలోకి చేరి ఉప ఎన్నికలను ఎదుర్కొంటారా? అంత ధైర్యం చేస్తారా?