మెగా ఇంజీనీరింగ్ లాంటి భారీ సంస్థ అధినేత పీపీ రెడ్డి చేతుల మీదుగా ఓ కొత్ సంస్థ ప్రారంభమైంది. పివీ సుబ్బారెడ్డి, ప్రేమ్ కుమార్ పాండే ఈ కొత్త సంస్థ అధినేతలు. భద్ర ప్రొడక్షన్ పేరుతో ప్రారంభమైన ఈ సంస్థ మొదటి చిత్రంగా 'తగ్గేదేలే' .. అనే సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగ బాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ తదితరులు నటిస్తున్నారు. భద్ర ప్రొడక్షన్ కంపెనీ లోగోను ఎంఈఐఎల్ పీపీరెడ్డి ఆవిష్కరించగా.. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి తగ్గేదేలే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత ప్రేమ్ కుమార్ పాండే మాట్లాడుతూ ‘మంచి కథలను సినిమాలుగా మలిచేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం. మన చరిత్రలో ఎన్నెన్నో కథలున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు విని ఉంటాం. అలాంటి కథలను చెప్పేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం.
మా మామగారు పిపీ రెడ్డి స్ఫూర్తితోనే ఈ బ్యానర్ ప్రారంభమైంది. మా మామగారి తల్లి పేరు భద్రమ్మ. ఆమె పేరు మీదుగానే భద్ర ప్రొడక్షన్‌ను స్థాపించాం. 120 కోట్లకు పైగా ఉన్న జనాబాలో ఎంతో టాలెంట్ ఉంటుంది. అలాంటి వారికి ఈ ఫ్లాట్ ఫాం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. కొత్త కథలను చెప్పేందుకు మేం సిద్దంగా ఉన్నాం. మా మొదటి చిత్రం కాన్సెప్ట్ బేస్డ్‌గా రాబోతోంది అన్నారు.
అనంతరం నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ. – . సరికొత్త కాన్సెప్టులతో సినిమాలు తీయడానికే ఈ బ్యానర్‌ను స్థాపించాం. అందులో మొదటి ప్రయత్నంగా తగ్గేదే లే సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి బ్లెసింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను“అన్నారు.
రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘భద్ర ప్రొడక్షన్ అనేది తెలుగు ఇండస్ట్రీకి పెద్ద బ్యానర్. . దండుపాళ్యం సినిమాను తీసిన శ్రీనివాస రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఆ గ్యాంగ్‌తో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. చాలా బాగా వచ్చింది. ఇండియాలో నెంబర్ వన్ ప్రొడక్షన్ కంపెనీగా చేసే అంత సత్తా ఉన్న నిర్మాతలు. మంచి కంటెంట్, ఎంటర్టైన్మెంట్ జానర్‌లో మొదటి ప్రయత్నంగా తగ్గేదేలే అనే చిత్రాన్ని చేస్తున్నారు అన్నారు.
దర్శకుడు శ్రీనివాస రాజు మాట్లాడుతూ.. ‘భద్ర ప్రొడక్షన్‌ను లాంచ్ చేసిన నిర్మాతలకు థ్యాంక్స్. ఇంత పెద్ద బ్యానర్‌లో నన్ను దర్శకుడిగా తీసుకున్నందుకు థ్యాంక్స్. వారు తలుచుకుంటే ఎంతో పెద్ద చిత్రాలను తీయగలరు. కానీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేయాలని అనుకున్నారు. చిన్న చిత్రం అయినా కూడా ఏది అడిగితే అది ఇచ్చారు. సినిమా అయిపోయింది. టైటిల్ కోసం చాలా ఆలోచించాం. ఈ టైటిల్ చెప్పింది నిర్మాతే.. ఇలాంటి టైటిల్ ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.