బాలయ్య సినిమాకు థియేటర్లు ఇవ్వరా?

సంక్రాంతికి రాబోతున్న మూడు సినిమాలు…వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య, వారసుడు. ఈ మూడింటిలో ఏ సినిమాకు తక్కువ థియేటర్లు దొరుకుతున్నాయి అన్న ప్రశ్న వేస్తే బాలకృష్ణ సినిమాకే అని సమాధానం వినిపిస్తోంది టాలీవుడ్ లో.  Advertisement…

సంక్రాంతికి రాబోతున్న మూడు సినిమాలు…వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య, వారసుడు. ఈ మూడింటిలో ఏ సినిమాకు తక్కువ థియేటర్లు దొరుకుతున్నాయి అన్న ప్రశ్న వేస్తే బాలకృష్ణ సినిమాకే అని సమాధానం వినిపిస్తోంది టాలీవుడ్ లో. 

మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య ను భారీగా విడుదల చేస్తున్నారు. మరో సినిమా వారసుడుకు నిర్మాత దిల్ రాజు మంచి థియేటర్ లు సెట్ చేసుకుంటున్నారని కూడా వార్తలు వున్నాయి. విశాఖ లాంటి సిటీలో వారసుడు సినిమాకు ఆరు థియేటర్లు వుంటే మెగాస్టార్ సినిమాకు నాలుగు, బాలయ్య సినిమాకు మూడు థియేటర్లు దొరకుతున్నాయని తెలుస్తోంది. అంతే కాదు ప్రయిమ్ థియేటర్లు అన్నీ వారసుడు సినిమాకు వెళ్లిపోతున్నాయని కూడా టాక్ వుంది.

ఇలాంటి నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రంగంలోకి దిగింది. డబ్బింగ్ సినిమా అయిన వారసుడు కు కాకుండా స్ట్రయిట్ సినిమాలు అయిన వాల్తేర్ వీరయ్య, వీర సింహా రెడ్డిలకు థియేటర్లు కేటాయించాలని ఎగ్జిబిటర్ లకు ఓ బహిరంగ లేఖ రాసింది. కానీ అంతా అయిపోయాక సంత అన్నట్లుంది ఈ వ్యవహారం. ఎందుకంటే ఇప్పటికి నెల రోజుల కిందటి నుంచే దిల్ రాజు అండ్ టీమ్ చకచకా థియేటర్ల అగ్రిమెంట్లు దాదాపు పూర్తి చేసారు.

ఇంక ఇప్పుడు లేఖ రాస్తే మాత్రం ఒరిగేది ఏముంటుంది. పైగా నిర్మాతల కౌన్సిల్ ఏమీ థియేటర్ల మీద అధారిటీ బాడీ కాదు. విని తీరాలన్న రూలేం లేదు. దిల్ రాజు లీడర్ గా వున్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా ఈ విషయంలో సైలంట్ గా వుండిపోయింది. మరి ఇలాంటి సిట్యువేషన్ లో కౌన్సిల్ లేఖ జ‌స్ట్ ఈ విషయాన్ని కాస్త హైలైట్ చేయడానికి తప్ప మరెందుకు పనికిరాదనెే చెప్పాలి.

మరి ముందు ముందు సినిమా రంగ పెద్దలు రంగ ప్రవేశం చేసి డబ్బింగ్ సినిమా వారసుడు ను కట్టడి చేస్తారో లేక దిల్ రాజు ముందు తల వంచి దొరికిన థియేటర్లతో సద్దుకుంటారో చూడాలి.