టీమిండియా కోచ్ ఎంపిక.. ఎందుకింత కామెడీగా!

ఎలాగూ రవిశాస్త్రినే మళ్లీ కోచ్ అవుతాడని చాలామంది అనుకున్నారు. అందుకు ప్రధాన కారణం రవికి టీమిండియా కెప్టెన్ కొహ్లీ అండదండలు ఉండటమే. టీమిండియా వ్యవహారాల్లో కొహ్లీ మాటే పవర్ ఫుల్. తను కావాలనుకున్న వారే…

ఎలాగూ రవిశాస్త్రినే మళ్లీ కోచ్ అవుతాడని చాలామంది అనుకున్నారు. అందుకు ప్రధాన కారణం రవికి టీమిండియా కెప్టెన్ కొహ్లీ అండదండలు ఉండటమే. టీమిండియా వ్యవహారాల్లో కొహ్లీ మాటే పవర్ ఫుల్. తను కావాలనుకున్న వారే జట్టుతో ఉంటారు, మిగిలిన వారికి సాగనంపడమే బీసీసీఐ చేయాల్సిన పని. ఆటగాడిగా కూడా తను రాణిస్తూ ఉండటంతో ప్రఖ్యాత ట్రోఫీలు నెగ్గలేకపోతున్నా కొహ్లీ మాటకు తిరుగులేదు.

కొహ్లీకి నచ్చలేదనే అనిల్ కుంబ్లేని సాగనంపారు. ఆయన స్థానంలో రవిశాస్త్రిని తెచ్చారు. కొహ్లీ అండ చూసుకుని రవిశాస్త్రి కూడా అసిస్టెంట్ కోచ్ లుగా తనకు కావాల్సిన వాళ్లను తెచ్చుకోగలిగాడు. ఇక ప్రపంచకప్ లో టీమిండియా తనలోని అంతర్గత లోపాలతోనే సెమిస్ లో వరకూ వెళ్లి ఓడింది. మిడిలార్డర్ పేలవ ప్రదర్శన ట్రోఫీ ఆసాంతం సాగింది. ఓపెనర్లు, వన్ డౌన్ బ్యాట్స్ మన్ రాణిస్తేనే గెలుపు, లేకపోతే లేదు అన్నట్టుగా తయారైంది పరిస్థితి.

ఆ పరిస్థితి చాలాకాలం నుంచినే ఉన్నా రవిశాస్త్రి ఆ విషయాన్ని సరిచేయలేకపోయాడు. తీరా సెమిస్ లో ఓడాకా నాలుగో నంబర్ బ్యాట్స్ మన్ గా ఎవరూ రాణించకపోవడంతోనే ఓడినట్టుగా చెప్పుకొచ్చాడు. మరి అన్ని రోజులూ ఏం చేసినట్టు? అనేదానికి కోచ్ దగ్గర సమాధానం లేదు.

అయినప్పటికీ ఇప్పటికీ రవిశాస్త్రికి కొహ్లీ అండదండలున్నాయి. ఎంతైనా ముంబై లాబీ కదా. శాస్త్రికి తిరుగులేదు. అదికాదు కానీ, మళ్లీ రవిశాస్త్రిని కోచ్ గా ఎంపిక చేయడానికి జరిగిన ప్రహసనమే క్రికెట్ ఫ్యాన్స్ లో చర్చకు తావిస్తోంది. ఎలాగూ రవిశాస్త్రినే కోచ్ గా కొనసాగించాలని అనుకున్నారు. కాబట్టి ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్టుగా ఒక ప్రకటన చేస్తేపోయేది. ఆ మాత్రం దానికి మళ్లీ అప్లికేషన్లను ఆహ్వానించడం,
ఇంటర్వ్యూలు అనడం, కపిల్ దేవ్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ.. ఇలా రకరకాల రచ్చచేశారు.

నిజంగా కోచ్ పదవి ఇస్తారేమో అని టామ్ మూడీ వంటి ప్రముఖ కోచింగ్ ఎక్స్ పర్ట్ మరోసారి అప్లికేషన్ పెట్టుకున్నాడు. మూడీ అప్లికేషన్ టీమిండియా కోచ్ విషయంలో తిరస్కరణకు గురికావడం కొత్త కాదు. దశాబ్దాల నుంచి ఇదే జరుగుతూ ఉంది. ఇప్పటివరకూ ఎప్పుడు ఇండియన్ కోచ్ పదవి ఖాళీ అయినా మూడీ దరఖాస్తు వస్తుంది. యథారీతిన తిరస్కరణకు గురి అవుతూ ఉంది.

కోచ్ ఎంపిక వ్యవహారంలో.. బీసీసీఐ వ్యవహారాలు మరోసారి నవ్వుల పాలయ్యాయి. రవిశాస్త్రిని ఎంపిక చేయాలని ఫిక్సయినప్పుడు ఇంత కామెడీ ఎందుకు చేసినట్టు? అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు!

రణరంగం సినిమాపై ప్రేక్షకులు ఏమన్నారంటే