సూపర్ బజ్ తో విడుదలయింది విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్. అయితే మార్నింగ్ షో నుంచే యావరేజ్ టాక్ రావడంతో సినిమా కమర్షియల్ ఫలితం ఎలా వుంటుందో అని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందాయి. పైగా ఆంధ్ర కోస్తా ఏరియాల్లో వర్షాలు విస్తారంగా పడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో డియర్ కామ్రేడ్ యాభై శాతానికి పైగా ఫస్ట్ వీకెండ్ లో రికవరీ కావడం బయ్యర్లను కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది.
వాస్తవానికి చాలాచోట్ల ఫిక్స్ డ్ హైర్ లు కలిపారు కాబట్టి, యాభైశాతం రికవరీ వచ్చింది అనుకోవాలి. అయితే సీడెడ్ మాత్రం యాభైశాతం రికవరీ రాలేదు. చాలా ఏరియాల్లో మిగిలిన యాభైశాతం ఇకపై రికవరీ కావాలి. అది సాధ్యమేనా? కాదా? అన్నది చూడాలి. ఈవారం రాక్షసుడు, గుణ 369 సినిమాలు విడుదలవుతున్నాయి. అవి వచ్చేలోగా డియర్ కామ్రేడ్ మాగ్జిమమ్ రికవరీ కావాల్సివుంది.
ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఇలా వున్నాయి.
నైజాం………………5.65
సీడెడ్………………1.08
ఉత్తరాంధ్ర………..1.56
ఈస్ట్…………………1.20
వెస్ట్…………………..0.83
కృష్ణా…………………0.73
గుంటూరు………….1.03
నెల్లూరు…………….0.48