వరల్డ్ కప్ లో టీమిండియా సెమిస్ బెర్త్ దాదాపుగా ఖరారు అయినట్టే. ఈ ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్ లను ఆడిన టీమిండియా అజేయంగా నిలిచింది. ఐదు మ్యాచ్ లలో గెలిచింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దు అయ్యింది. మరో మూడు మ్యాచ్ లున్నాయి.
వాటిల్లో రెండు మ్యాచ్ లను శ్రీలంక, బంగ్లాదేశ్ లపై ఆడాల్సి ఉంది, ప్రస్తుత ఫామ్ రీత్యా ఆ రెండు జట్లతోనూ టీమిండియా నెగ్గే అవకాశాలున్నాయి. అయితే ఆదివారం ఇంగ్లండ్ తో మ్యాచ్ ఇప్పుడు అత్యంత ఆసక్తిదాయకంగా మారింది.
ఈ మ్యాచ్ ఇండియాకు కాదు కానీ, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లకు చావోరేవో లాంటి మ్యాచ్. టోర్నమెంట్ కు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ రోజు ఓడితే ఇంగ్లండ్ సెమిస్ అవకాశలు మృగ్యం అవుతాయి.
తన తదుపరి మ్యాచ్ లో నెగ్గినా ఇంగ్లండ్ సెమిస్ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయి, అందులోనూ తదుపరి మ్యాచ్ లో బలమైన ప్రత్యర్థిని ఢీ కొట్టాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఇండియాతో మ్యాచ్ తమకు క్వార్టర్ ఫైనల్ లాంటిదని ఆ జట్టు ఆటగాళ్లు ప్రకటించారు.
ఇక ఆ సంగతలా ఉంటే.. ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ పై అత్యంత ఆసక్తితో ఉంది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడిపోతే పాక్ సెమిస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అందుకే ఎటు తిరిగీ ఇండియా నెగ్గాలని పాకిస్తాన్ కోరుకుంటూ ఉంది.
బ్రిటన్లో పెద్ద ఎత్తున ఉండే పాకిస్తానీయులు ఈ రోజు మైదానంలోకి వచ్చి ఇండియాకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది, మరోవైపు ఇంగ్లండ్ పై ఇండియా కావాలని ఓడిపోతుందని, తద్వారా తమ సెమిస్ అవకాశాలను ఆ జట్టు దెబ్బతీస్తుందని కూడా కొంతమంది పాకిస్తానీయులు కుటిలంగా మాట్లాడుతూ ఉన్నారు!
సమ్మర్‌కి బంపర్ బిగినింగ్! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్ డిజాస్టర్!