బండ్లకు అంత సీన్ లేదుగా?

అదిగో పవర్ స్టార్ సినిమా అంటే ఇదిగో నిర్మాత, అల్లదిగో డైరక్టర్ అన్నట్లు వుంది వ్యవహారం. కానీ అసలు విషయం ఏమిటంటే, సినిమా ఎప్పుడు చేస్తారు? ఎవరితో చేస్తారు? అసలు చేస్తారా? చేయరా? అన్నది…

అదిగో పవర్ స్టార్ సినిమా అంటే ఇదిగో నిర్మాత, అల్లదిగో డైరక్టర్ అన్నట్లు వుంది వ్యవహారం. కానీ అసలు విషయం ఏమిటంటే, సినిమా ఎప్పుడు చేస్తారు? ఎవరితో చేస్తారు? అసలు చేస్తారా? చేయరా? అన్నది పవర్ స్టార్ మాత్రమే సమాధానం చెప్పగలిగిన ప్రశ్న. ఆయన ఈ విషయాలు ఎవ్వరితో డిస్కస్ చేయడంలేదు. ఆలోచనలు షేర్ చేసుకోవడం లేదు. సినిమా చేసే ఆలోచన వుంది అన్నది మాత్రమే పవన్ సన్నిహితులకు ఇప్పటివరకు తెలిసిన విశేషం.

ఇలాంటి నేపథ్యంలో బోయపాటి-పవన్-బండ్లగణేష్ కాంబినేషన్ లో సినిమా అన్న వార్త బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అది ఫేక్ న్యూస్. పవన్ సినిమా చేయాలి అంటే అడ్వాన్స్ లు తీసుకున్న సంస్థలు చాలా వున్నాయి. అన్నింటికి మించి త్రివిక్రమ్ కు, ఆయన మాటకు ప్రయారిటీ వుంటుంది. అందువల్ల ఈ మధ్యలో బండ్ల దూరే ప్రసక్తేలేదు.

అసలు ఈ ప్రాజెక్ట్ ఆలోచనే బండ్ల చేయడం లేదని ఆయన సన్నిహిత వర్గాల బోగట్టా. మొత్తంమీద బండ్ల పేరు ఓ రోజు మారు మోగింది. పవన్ తో సినిమా అంటూ. కానీ రేపు ఈ రాసిన వాళ్లంతా గప్ చుప్ కావాల్సిందే.

రిలేషన్ షిప్స్ లో సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఇవి!