ఇష్టమైన స్వీట్ కోసం 200 కిలోమీటర్లు ప్రయాణం

ఎంతో ఇంపార్టెంట్ పనుంటే తప్ప ఎవ్వరూ 200 కిలోమీటర్లు ప్రయాణం చేయరు. అంత దూరం ప్రయాణం చేశారంటే కచ్చితంగా అది వాళ్లకు చాలా ముఖ్యమని అర్థం. మరి కేవలం ఓ స్వీట్ కోసం 200…

ఎంతో ఇంపార్టెంట్ పనుంటే తప్ప ఎవ్వరూ 200 కిలోమీటర్లు ప్రయాణం చేయరు. అంత దూరం ప్రయాణం చేశారంటే కచ్చితంగా అది వాళ్లకు చాలా ముఖ్యమని అర్థం. మరి కేవలం ఓ స్వీట్ కోసం 200 కిలోమీటర్లు  జర్నీ చేసేవాళ్లను ఏమనాలి? తనకు ఆ స్వీట్ ఇష్టం అంటోంది విక్కీ గీ. అందుకే అంత దూరం ట్రాలెవ్ చేశానని చెబుతోంది.

బ్రిటన్ కు చెందిన విక్కీ.. కేంబ్రిడ్జ్ నుంచి యార్క్ షైర్ లోని బార్న్స్ లే వరకు ఏకథాటిగా 200 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. అలా ప్రయాణించి ఆమె డాలీస్ షాప్ కు చేరుకుంది. అక్కడ చేసే బిస్కోస్ పుడ్డింగ్ (ఓ రకమైన స్వీట్) అంటే విక్కీకి చాలా ఇష్టం. అందుకే కేవలం ఆ స్వీట్ కోసమే ఆమె ఇంత దూరం ప్రయాణం చేసింది.

200 కిలోమీటర్లు దూరం ఎలా ప్రయాణించారని అడిగితే.. జస్ట్ మూడున్నర గంటలు మాత్రమే ప్రయాణం అంటూ ఆమె బదులిచ్చింది. అంటే.. ఆ స్వీట్ కోసం ఆమె రానుపోను 7 గంటల పాటు ప్రయాణం చేసిందన్నమాట. జర్నీ కాస్త ఇబ్బంది అనిపించినప్పటికీ నచ్చిన స్వీట్ కోసం ఇష్టంగా పూర్తిచేశానని చెబుతోంది విక్కీ. అంతేకాదు.. ఆ స్వీట్ కోసం మళ్లీ మళ్లీ వస్తానంటోంది కూడా.

ఇష్టంతో చేసే పని ఏదైనా కష్టం అనిపించదంటారు ఇందుకేనేమో. సోషల్ మీడియాలో ఈమె జర్నీని చూసిన నెటిజన్లు, తమ జీవితంలో జరిగిన అలాంటి క్రేజీ టూర్స్ అనుభవాల్ని కూడా పోస్ట్ చేస్తున్నారు. ఓ

స్వీట్ కోసం ఇంత దూరం ప్రయాణించిన వ్యక్తి బహుశా ప్రపంచంలో విక్కీ ఒక్కరే అయి ఉండొచ్చని అంటున్నారు డాలీస్ షాప్ యజమానులు. ఈ వీడియో తర్వాత ఈ షాపులో బిస్కోస్ పుడ్డింగ్ కు డిమాండ్ అమాంతం పెరిగింది.