వ్యభిచార ముఠా కోసం వెళ్తే డ్రగ్స్ లింక్ దొరికింది

కొన్ని కేసులంతే. ఒకటి అనుకొని అరెస్ట్ చేస్తే, ఇంకో కేసు కొలిక్కి వచ్చిన సందర్భాలు కోకొల్లులు. హైదరాబాద్ లో కూడా అలాంటి ఆధారమే ఒకటి దొరికింది. ఓ విదేశీ వ్యభిచార ముఠాను వలపన్ని పట్టుకున్నారు…

కొన్ని కేసులంతే. ఒకటి అనుకొని అరెస్ట్ చేస్తే, ఇంకో కేసు కొలిక్కి వచ్చిన సందర్భాలు కోకొల్లులు. హైదరాబాద్ లో కూడా అలాంటి ఆధారమే ఒకటి దొరికింది. ఓ విదేశీ వ్యభిచార ముఠాను వలపన్ని పట్టుకున్నారు పోలీసులు. అయితే ఆశ్చర్యంగా డ్రగ్స్ లింక్ బయటపడింది.

లొకాంటో యాప్ ద్వారా అమ్మాయిల ఫొటోలు పెట్టి వ్యభిచారం నిర్వహిస్తోంది ఓ ముఠా. వీళ్లలో ఉగాండా దేశానికి చెందిన అమ్మాయిలు కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు వలపన్నారు. డిపార్ట్ మెంట్ లోనే ఓ వ్యక్తి నకిలీ విటుడిగా మారాడు. లోకాంటోలో వాళ్లను సంప్రదించాడు.

నకిలీ విటుడి వేషంలో ఉన్న పోలీస్ చెప్పిన లొకేషన్ కు ముగ్గురు అమ్మాయిలు వచ్చారు. వెంటనే చుట్టుపక్కలున్న పోలీసులు వలపన్ని అందర్నీ అరెస్ట్ చేశారు. ముగ్గురు అమ్మాయిలతో పాటు మరో ఇద్దరు నిర్వహకుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇలా వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశామనుకునేలోపే డ్రగ్స్ లింక్ బయటపడింది. సదరు అమ్మాయిల నుంచి 5 గ్రామలు కెటామైన్ డ్రగ్ తో పాటు మరో 17 గ్రాముల మత్తుపదార్థాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దీంతో వీళ్లకు డ్రగ్స్ ఎక్కడ్నుంచి వస్తున్నాయనే కోణంలో కొత్తగా దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ కేసులోనే మరో సబ్-కేసు కూడా బయటపడింది.  అదేంటంటే.. ఈ విదేశీయులంతా టూరిస్ట్ వీసా మీద ఇండియాకొచ్చి చట్టవిరుద్ధంగా హైదరాబాద్ లో ఉండిపోయారు.