‘సుజయ’కు పొలిటికల్ ఆక్సిజన్?

రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన మాజీ మంత్రి సుజయ కృష్ణరంగారావు ఎట్టేకలకు నోరు విప్పారు.  Advertisement విజయనగరం జిల్లా మహారాజా ఆసుపత్రిలో ఇద్దరు కరోనా రోగులు…

రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన మాజీ మంత్రి సుజయ కృష్ణరంగారావు ఎట్టేకలకు నోరు విప్పారు. 

విజయనగరం జిల్లా మహారాజా ఆసుపత్రిలో ఇద్దరు కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారని వార్తలు రావడంపైన ఆయన మండిపడ్డారు. ఇదేనా పాలనంటే, ఇలాగైనా చేయడం అంటూ జగన్ సర్కార్ మీద కాస్తా గట్టిగానే మాట్లాడారు. 

అయితే సాంకేతిక సమస్య వల్లనే ఇలా జరిగిందని అధికారులు చెప్పడంతో పాటు పెద్ద సంఖ్యలో కరోనా రోగులు మరణించలేదని వార్తలు రావడంతో సుజయ కృష్ణరంగారావు ఆగ్రహం పెద్దగా ఫలించలేదు. 

అయితే విజయనగరం జిల్లాలో అనేక సమస్యలతో తెలుగుదేశం ఆందోళనలు ఇంతకు ముందు జరిగినా కూడా నోరు విప్పని మాజీ మంత్రి ఇపుడు అకస్మాత్తుగా గొంతు సవరించడం వెనక కారణాలు ఏంటి అన్నదే చర్చగా ఉంది. 

ఆయనను బీజేపీలో చేర్పించాలని ప్రయత్నాలు జరిగాయి. వైసీపీలో చేరేందుకు ఆయన చూస్తున్నారని కూడా ప్రచారం అయితే సాగింది. ఇక ఆయన రాజకీయాలేక స్వస్తి పలుకుతారు అన్న మాట కూడా వినిపించింది. అయితే ఆయన ఇపుడు మళ్లీ చురుకుదనం చూపించాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. 

కరోనా తగ్గిన తరువాత తన కార్యాచరణ కూడా ప్రకటిస్తారని చెబుతున్నారు. విజయనగరం జిల్లా మహారాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పూర్తిగా రాజకీయాల నుంచి పక్కకు వెళ్లడంతో జిల్లాలో పెద్ద దిక్కుగా తాను ముందుకు రావాలని సుజయ కృష్ణ రంగారావు తాజాగా ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. 

వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితుల బట్టి రాజకీయం మార్చాలని కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు.