ఉప్పెన సాంగ్ కు దారం

మైత్రీ మూవీస్-సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించే ఉప్పెన సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. పాటల విడుదల షురూ చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలిపాట కు చిన్న ప్రోమో కట్ చేసి వదిలారు. దేవీశ్రీప్రసాద్ కు…

మైత్రీ మూవీస్-సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించే ఉప్పెన సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. పాటల విడుదల షురూ చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలిపాట కు చిన్న ప్రోమో కట్ చేసి వదిలారు. దేవీశ్రీప్రసాద్ కు డైరక్టర్ బుచ్చిబాబు  సీన్ వివరిస్తుంటే ఆశువుగా దేవీ రెండు లైన్లు చెబుతున్న ప్రోమో అది.

పాట అంతా రాలేదు కాబట్టి, ఎలా వుంది, ట్యూన్ ఏంటీ అన్నది డిస్కస్ చేసే విషయం కాదు. కానీ  వదిలిన రెండు లైన్లు మాత్రం బాగున్నాయి.

''..నీ కళ్లు నీలి సముద్రం..నా మనసేమో అందులో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం…దారం..''

భావావేశాన్ని రంగరించి రాసినట్లున్నాయి రెండు లైన్లు. ఆరంభంలో జస్ట్ సాకీ  మాదిరిగా వినిపించారు కాబట్టి ట్యూన్ దేవీ స్టయిల్ ను చటుక్కున గుర్తుకు వచ్చేస్తుంది. టోటల్ పాట వస్తే అసలు ఏంటి కథ అన్నది క్లారిటీ వస్తుంది. ఉప్పెనతో దేవీ మళ్లీ మరోసారి తన మార్కు చాటతారనే అనుకోవాలి.