వినయ విధేయ రామ.. బోయపాటి-చరణ్ టైటిల్

వింత వింత టైటిళ్ల కోసం వెదుకుతున్నారు దర్శకులంతా. అత్తారింటికి దారేది అంటూ త్రివిక్రమ్ దారితీసాడు. ఇంక అందరూ మొదలుపెట్టారు. భరత్ అనే నేను అన్నారు కొరటాల శివ. తానే తక్కువా అని జయ జానకీ…

వింత వింత టైటిళ్ల కోసం వెదుకుతున్నారు దర్శకులంతా. అత్తారింటికి దారేది అంటూ త్రివిక్రమ్ దారితీసాడు. ఇంక అందరూ మొదలుపెట్టారు. భరత్ అనే నేను అన్నారు కొరటాల శివ. తానే తక్కువా అని జయ జానకీ నాయక అన్నాడు బోయపాటి.

ఇలా ఎవరికి వారు విభిన్నమైన టైటిళ్లతో వస్తున్నారు. రాబోయే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కు అరవింద సమేత వీరరాఘవ అని టైటిల్ పెడితే, రామ్ చరణ్-బోయపాటి సినిమా కోసం వినయ విధేయ రామ అనే టైటిల్ రిజిస్టర్ చేసారు. సాధారణంగా పెద్ద సినిమాలకు వేరే బ్యానర్ పై టైటిల్ రిజస్టర్ చేసి, లీక్ కాకుండా జాగ్రత్త పడతారు. ఆ తరువాత ఈ బ్యానర్ మీదకు మారుస్తారు.

కానీ రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ డైరక్ట్ గా డివివి దానయ్య బ్యానర్ పైనే రిజిస్టర్ చేసారు. అంటే దాదాపు అదే ఫైనల్ అనుకోవాలి. తరువాత తరువాత ఎలా వుంటుందో కానీ, ముందుగా అయితే ఇదేం టైటిల్ అన్న రియాక్షన్ అయితే వస్తోంది. బోయపాటి కూడా కావాలని త్రివిక్రమ్ స్టయిల్ టైటిళ్లు పెడుతున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.