చిన్న సినిమా ప్రమోషన్ సాంగ్ హాఫ్ మిలియన్ వ్యూస్

సాధారణంగా పెద్ద సినిమాలకు ప్రమోషన్ సాంగ్ లు చేయడం కామన్. కానీ చిన్న సినిమాకు పెద్ద లెవెల్లో ప్రమోషన్ సాంగ్ చేయడం అంటే విశేషమే. భార్యాభర్తల మధ్య లోపిస్తున్న అనుబంధాలపై సెటైరికల్ గా తయారుచేసిన…

సాధారణంగా పెద్ద సినిమాలకు ప్రమోషన్ సాంగ్ లు చేయడం కామన్. కానీ చిన్న సినిమాకు పెద్ద లెవెల్లో ప్రమోషన్ సాంగ్ చేయడం అంటే విశేషమే. భార్యాభర్తల మధ్య లోపిస్తున్న అనుబంధాలపై సెటైరికల్ గా తయారుచేసిన సబ్జెక్ట్ తో అందిస్తున్న సినిమా జంబలకిడిపంబ. కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరో. వెన్నెలకిషోర్, పోసాని తదితరులు కీలకపాత్ర ధారులు. గతంలో అనేక హిట్ సినిమాలకు ఇటు తెలుగులో, అటు మళయాలంలో స్క్రిప్ట్ అసిస్టెంట్ గా పని చేసిన మను దర్శకుడు.

ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్ సాంగ్ తయారుచేసి వదిలారు. గోపీసుందర్ మ్యూజిక్ డైరక్షన్ లో ఫుల్ లెంగ్త్ సాంగ్ ప్రత్యేకంగా రాయించి, చిత్రీకరించి విడుదలచేసారు. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో హాఫ్ మిలియన్ వ్యూస్ సాధించింది. ఎటువంటి డిజిటల్ ప్రమోషన్ చేయకుండా, యూట్యూబ్ లో హాఫ్ మిలియన్ వ్యూస్ సాధించిందని నిర్మాత సురేష్ రెడ్డి తెలిపారు.

ఈ ప్రమోషన్ సాంగ్ కు మాత్రమే కాదు, సినిమాలో పాటలన్నింటికీ యూట్యూబ్ లో మంచి ఆదరణ లభించిందన్నారు. కథ విన్న తరువాత కానీ సంగీత దర్శకుడు గోపీ సుందర్ కమిట్ మెంట్ ఇవ్వలేదని, ఇచ్చిన మాట ప్రకారం మంచి పాటలు, నేపధ్యసంగీతం ఇచ్చారని ఆయన అన్నారు.

జంబలకిడిపంబ అలనాటి సినిమా సూపర్ హిట్ అని, దానికి దీనికి ఏ సంబంధం లేదని, ఇది పూర్తిగా కొత్త కథ, కొత్త ఆలోచన అని, రాను రాను మూణ్ణాళ్ల ముచ్చట అవుతున్న కాపురాలను చూసి, యువతకు కాస్త మెసేజ్ అందించేలా ఓ మాంచి కథ రాసుకున్నామని, దాన్ని ఫన్నీ వే లో చెబుతున్నామని, ఈ నెల 14న సినిమా విడుదల చేసే ఆలోచనలో వున్నామని తెలిపారు.