సాయి ధరమ్ తేజ, హిట్ కోసం కిందా మీదా అవుతున్న మెగా హీరో. హిట్ మాట అలా వుంచితే, ఫిజిక్ విషయంలో చాలా ట్రాక్ తప్పేసాడు అన్న విమర్శవుంది. చాలా లావుగా వున్నాడు. ఫిజిక్ ను అస్సలు పట్టించుకోవడం లేదు అన్న మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తూ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టాడు తేజు.
ప్రస్తుతం చేస్తున్న తేజ్ ఐ లవ్ యు సినిమా పూర్తి కావచ్చింది. మైత్రీ మూవీస్-కిషోర్ తిరుమల సినిమా జూలై లేదా ఆగస్టులో మొదలవుతుంది. అందుకే ఆ లోగా మొత్తం మేకోవర్ కావాలని తేజు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు మెగా కజిన్ రామ్ చరణ్ సాయం తీసుకున్నాడని తెలుస్తోంది.
ధృవ సినిమా దగ్గర నుంచి రామ్ చరణ్ ఫిజిక్ అద్భుతంగా మారింది. దీనికి వెనుక వున్న ట్రయినర్ నే ఇప్పుడు తేజు కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. ఆ ట్రయినర్ సాయంతో తేజ భయంకరంగా వర్కవుట్ లు చేయాలని డిసైడ్ అయిపోయాడట. రెండు నెలల్లో కొత్త తేజును చూడబోతున్నాను అభిమానులు.