భాయ్ సినిమా నాగ్ కు బాగా గుర్తుంటుంది. ఎందుకంటే అప్పట్లో, ఆ తరువాత కూడా చాలాసార్లు ఆయన భాయ్ సినిమా గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా డైరక్టర్ వీరభద్రమ్ చౌదరిని టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు.
ఆ సినిమా పరాజయానికి, మొత్తం కర్త, కర్మ, క్రియ అంతా వీరభద్రమ్ చౌదరే అన్నట్లు ఓపెన్ గా విమర్శించేవారు. పాపం, పదే పదే ఇలా నాగ్ తనను టార్గెట్ చేయడంతో వీరభద్రమ్ ఏమీ అనలేక సైలంట్ అయ్యారు.
ఆ మాటకు వస్తే అన్నపూర్ణ బ్యానర్ కు రెండు హిట్ లు ఇచ్చిన కళ్యాణ్ కష్ణ గురించి కూడా కాస్త సన్నాయి నొక్కులు నొక్కారు నాగ్. కథ చెప్పాడు బాగాలేదు అని చెప్పేసా అని బహిరంగంగానే కామెంట్ చేసారు నాగ్. ఆయన స్వభావం అది.
భాయ్ సినిమా ఇప్పడు వచ్చిన ఆఫీసర్ తో పోల్చుకుంటే పదిరెట్లు బెటర్. మరి ఇప్పుడు నాగ్ ఎవరి గురించి మాట్లాడాలి? వర్మ గురించి ఎంత కామెంట్ చేయాలి? ఎన్ని చెప్పాలి? అవేమీ అనకుండా హిట్ లే జీవితం కాదు, ప్లాపులే పరమార్థం కాదు అన్నట్లు ఓ ట్వీట్ వేసి ఊరుకున్నారు.
వర్మ గురించి ఇసుమంత కామెంట్ చేయలేదు. పోనీ భవిష్యత్ లో మీడియా మీట్ ల్లో అయినా వర్మ గురించి నాగ్ కుండబద్దలు కొడతారేమో చూడాలి. లేదా వీరభద్రమ్, కళ్యాణ్ కృష్ణ వేరు, వర్మవేరు అని ఊరుకుంటారో?