బోయపాటి మాంచి జోరు మీద వున్నారు. రామ్ చరణ్ తో సినిమా చకచకా చేస్తున్నారు. ఆపైన బాలయ్య సినిమా వుండనే వుంది. ఇలాంటి టైమ్ లో అర్జెంట్ గా గీతా ఆఫీస్ కు వచ్చి బన్నీని కలిసారు? బన్నీ సరైన సినిమా కోసం చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో బోయపాటి వచ్చి కలవడంతో, ఏమై వుంటుందా? అని ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి.
ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలయ్యతో సినిమా చేయాలి. బయోపిక్ సినిమా సంక్రాంతికి అని టాక్ వుంది. బోయపాటి-రామ్ చరణ్ సినిమా కూడా అప్పుడే విడుదల అని టాక్. మరి బోయపాటికి ఎలాంటి గ్యాప్ లేదు. బన్నీతో డిస్కషన్లు? సినిమా ఆలోచన దేనికి?
అంటే బాలయ్య సినిమా తరువాత మళ్లీ బన్నీతో సినిమా చేయాలన్న ఆలోచన బోయపాటిలో వుందా? బన్నీ కూడా అన్నీ సెట్ అయితే బోయపాటితో మళ్లీ చేయాలని అనుకుంటున్నారా? ఇదిలా వుంటే బన్నీతో సినిమాలు చేయాలని హరీష్ శంకర్, సంపత్ నంది, ఇంకా చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
చిత్రమేమిటంటే, అంతగా అవకశాలు లేని మీడియం రేంజ్ డైరక్టర్ లు అంతా బన్నీ చుట్టూ తిరుగుతూ వుంటే, సరైన ప్రాజెక్టు కోసం బన్నీ ఎదురు చూస్తున్నారు.