నాగార్జున కెరియర్‌లో అంతవరకు ముప్పయ్ కోట్ల షేర్ వచ్చిన సినిమానే లేదు. ఆ టైమ్‌లో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' కాంపిటీషన్‌ని తట్టుకుని మరీ యాభై కోట్ల షేర్ సాధించింది. ఆ చిత్రంతో దర్శకుడిగా కళ్యాణ్‌కృష్ణ మెప్పించినప్పటికీ అతనికి రావాల్సిన క్రెడిట్ రాలేదనిపించింది.
కళ్యాణ్‌కృష్ణ రెండవ చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం' ఈ నెల 26న విడుదల కానుంది. నాగార్జునకి 'నిన్నే పెళ్లాడతా' ఎలాగో ఇది నాగచైతన్యకి అలాంటి సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. కళ్యాణ్‌కృష్ణ కనుక 'సోగ్గాడే' విజయాన్ని రిపీట్ చేసినట్టయితే అతనికి దర్శకుడిగా ఒకేసారి స్టార్‌డమ్ వచ్చేస్తుంది.
అలాగే సోలోగా ఇంతవరకు పెద్ద విజయాన్ని అందుకోని నాగచైతన్యకి కూడా ఒక పెద్ద బ్లాక్‌బస్టర్ తప్పనిసరి. మీడియం రేంజ్ హీరోల్లో పోటీ తీవ్రమవుతోన్న నేపథ్యంలో అతను తన సత్తా చాటుకోవాల్సి వుంది. ప్రేమమ్ అలాంటి విజయాన్ని అందిస్తుందని ఆశించినా అది జరగలేదు. రారండోయ్ అయినా అతడి కోరిక తీరుస్తుందో లేదోచూడాలి.