బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ లో సంచలనమే సృష్టించాడు. ఏకంగా ఎనభై కోట్ల రూపాయల మొత్తాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ గా చెల్లించాడు ఈ హీరో. ఈ మొత్తంతో ఈ జాబితాలోని బాలీవుడ్ నటుల్లో టాప్ పొజిషన్లో నిలిచాడు ఈ హీరో.
రెండో స్థానంలో నిలిచాడు ఆమిర్ ఖాన్. 72 కోట్ల రూపాయల మొత్తాన్ని ముందస్తు పన్నుగా చెల్లించాడు ఆమిర్. బాలీవుడ్ లో వరస సినిమాలతో హిట్లు కొడుతూ.. వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తున్న సినిమా హీరోల కన్నా.. హృతిక్, ఆమిర్ లు ఈ పన్ను చెల్లింపుల్లో ముందు ఉండటం గమనార్హం.
ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు రణ్ భీర్ కపూర్. ఇటీవలే కళ్లు చెదిరే రీతిలో ఇంటిని నిర్మించుకున్న ఈ హీరో 37 కోట్ల రూపాయల మొత్తాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో చెల్లించాడు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ జాబితాలో సల్మాన్ అడుగున ఉండటం. సల్లూ కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్ కేవలం పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే. ఒకవైపు సల్లూ సినిమాలు వసూళ్లలో తిరుగులేని రికార్డులు స్థాపిస్తుంటే.. అడ్వాన్స్ ట్యాక్స్ లో ఈ హీరో వెనుకబడ్డాడు. ఇక అక్షయ్ కుమార్ పది కోట్ల రూపాయల మొత్తాన్ని ముందస్తు పన్నుగా చెల్లించినట్టు సమాచారం.