రిలయన్స్ ఫైనాన్స్ కు డైరక్టర్ వర్మకు ఏదో చిరకాల సమస్య. అది ప్రతి సినిమా విడుదల విషయంలో కాస్త ఇబ్బంది పెడుతుంటుంది. ఇప్పుడు వంగవీటి విషయంలో కూడా అదే సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. రిలయన్స్ సంస్థ ఇప్పటికే సినిమా డిజిటల్ డిస్ట్రిబ్యూటింగ్ ఏజెన్సీ అయిన యుఎఫ్ఓ కి ఈ సినిమా విడుదల ఆపమని నోటీసు ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు, చిక్కుముడి విప్పేందుకు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం రిలయన్స్ ప్రతినిధులకు, వంగవీటి ప్రతినిథులకు డిస్కషన్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
వంగవీటి సినిమా రేపు విడుదల కావాల్సి వుంది. ఈ సినిమాకు పది నుంచి 12 కోట్లు ఖర్చు చేసారు. ఇటీవల కాలంలో వర్మ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఇఫ్పటికే టికెట్ బుకింగ్ సైట్స్ లో మంచి ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి.