ఏం జరుగుతోంది..బాలయ్య ఆరా?

శాతకర్ణి వెనుక ఏం జరుగుతోంది..ఎవరు కారణం?వంటి విషయాలు పూర్తిగా తెలుసుకుని కట్టడి చేయమని హీరో బాలయ్య తన స్టాఫ్ ను ఆదేశించినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. శాతకర్ణి సినిమాకు సంబంధించి ఆది నుంచీ కాస్త…

శాతకర్ణి వెనుక ఏం జరుగుతోంది..ఎవరు కారణం?వంటి విషయాలు పూర్తిగా తెలుసుకుని కట్టడి చేయమని హీరో బాలయ్య తన స్టాఫ్ ను ఆదేశించినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. శాతకర్ణి సినిమాకు సంబంధించి ఆది నుంచీ కాస్త వార్తలు ఎక్కువగానే వస్తున్నాయి. ప్రారంభంలో శాతకర్ణి క్రెడిట్ అంతా క్రిష్ దే తప్ప బాలయ్య దు కాదు అనే రీతిగా జనాలను డైవర్ట్ చేసే విధమైన వార్తలు బయటకు వచ్చాయి. అప్పుడు బాలయ్య స్టాఫ్ టేకిట్ ఈజీగా తీసుకున్నారు.

కానీ వన్స్ ట్రయిలర్ బయటకు వచ్చిన తరువాత ఏకంగా సినిమాను దెబ్బతీసే విధంగా వార్తలు బయటకు వస్తున్నాయి. వీటిని కావాలనే కొందరు స్ప్రెడ్ చేస్తున్నారన్నది అనుమానం. కావాలని శాతకర్ణిని దెబ్బ తీసే విధంగా, దాని బజ్ ను తగ్గించే విధంగా వార్తలు కొందరు వదుల్తున్నారని, కీలక మీడియా సంస్థలను టార్గెట్ చేసుకుని, ఈ ఫీలర్లు అందిస్తున్నారని బాలయ్య స్టాఫ్ కు అర్థమైందట.

దీంతో అలర్ట్ అయి ఆరా తీసి, దీని వెనుక వున్న కొన్ని విషయాలను బాలయ్య దృష్టికి తీసుకెళ్లినట్లు బోగట్టా. దీనిపై బాలయ్య అభిమానులు కొందరు బాగా సీరియస్ అయి, అసలు ఎవరు ఎందుకు ఇదంతా చేస్తున్నారో మొత్తం బయటకు లాగుతామని బాలయ్య ముందే అన్నారని తెలుస్తోంది… పరిస్థితి చేయదాటవద్దని, అసలు ఎవరు? ఎందుకు ? ఇదంతా చేస్తున్నారో ఆరా తీసి, క్లియర్ పిక్చర్ ఇమ్మని బాలయ్య కోరినట్లు తెలుస్తోంది.

ఆపైన ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శాతకర్ణిపై వస్తున్న వార్తలకు కేంద్రం ఎవరో అన్నది కొంతమంది జర్నలిస్టుల ద్వారా ఆరా తీసే పనిలో పడ్డట్టు వినికిడి.