బచ్చన్..బాలయ్య..భవ్య

భవ్య సంస్థ బాలయ్యతో సినిమాకు రెడీ అవుతోంది. వందో సినిమాలో బాలయ్య పార్ట్ వర్క్ దాదాపు అయిపోతోంది. సో, 101వ సినిమాకు ఏర్పాట్లు షురూ అవుతున్నాయి. కృష్ణ వంశీ దర్శకుడు. సాక్షి రామ్ రెడ్డి…

భవ్య సంస్థ బాలయ్యతో సినిమాకు రెడీ అవుతోంది. వందో సినిమాలో బాలయ్య పార్ట్ వర్క్ దాదాపు అయిపోతోంది. సో, 101వ సినిమాకు ఏర్పాట్లు షురూ అవుతున్నాయి. కృష్ణ వంశీ దర్శకుడు. సాక్షి రామ్ రెడ్డి కథకుడు. సినిమా రైతు. ఈ విషయాలన్నీ తెలిసినవే. ఇప్పుడు ఇవ్వాళ బయటకు వచ్చిన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర ప పోషించబోతున్నారన్నది. 

ఆ మధ్యనే అమితాబ్, తాను తెలుగులో నటించాలనుకుంటున్నానని కోరిక వెలిబుచ్చారు. గతంలో మనంలో చిన్న కామియో క్యారెక్టర్ పోషించారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ క్యారెక్టరో, లేదా కీలకమైన క్యారెక్టర్ నో పోషించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకోసమే బాలయ్య, కృష్ణవంశీ ముంబాయి వెళ్లి, సర్కార్ సెట్ మీద అమితాబ్ ను కలిసి ఈ మేరకు స్క్రిప్ట్ , పాత్ర విషయాలు చర్చించినట్లు గ్యాసిప్ లు గుప్పు మన్నాయి. 

మరి ఈ గ్యాసిప్ లు నిజమైతే, అమితాబ్ ను తెలుగు సినిమాలో చూసేయచ్చు. కానీ ఒక్కటే అనుమానం. అమితాబ్ తెలుగు నేటివిటీకి సూటవుతారా? అన్నదే. చాలా మంది బాలీవుడ్ నటులు తెలుగులో కనిపించారు. వీరిలో చాలా మంది పాలు నీళ్లలా తెలుగు సినిమాలో కలిసిపోయారు. అమ్రేష్ పురి లాంటి వాళ్లు మిక్స్ కాకపోయినా, ఓ డిఫరెంట్ స్టయిల్ లో జనాన్ని అలరించారు. మరి అమితాబ్ ఏం చేస్తారో?